Asianet News TeluguAsianet News Telugu

అధ్య‌క్ష రేసులో శశిథరూర్.. ఆ రోజే నామినేషన్ దాఖలు 

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వికి పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు శశి థరూర్ సెప్టెంబర్ 30న నామినేషన్ దాఖలు చేయనున్నారు, ఓటింగ్ ద్వారా నాలుగోసారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో థరూర్ టచ్ లో ఉన్నట్లు సమాచారం. అతని అభ్యర్థిత్వానికి ప్రతిపాదకులుగా 50 మంది ప్రతినిధులు అవసరం.

Congress president poll  Shashi Tharoor to file nomination on Sept 30
Author
First Published Sep 25, 2022, 11:59 PM IST

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌వికి  పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎంపీ శ‌శిథ‌రూర్ పోటీ చేయ‌నున్నారు.  ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈ నెల 30న‌ నామినేష‌న్ దాఖ‌లు చేయనున్నారు. ఏ వ్య‌క్తి అయినా.. జాతీయ‌ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ ప‌డాలంటే.. ఆ అభ్య‌ర్థి పేరును దేశంలోని 50 మంది పార్టీ డెలిగేట్స్ ప్ర‌తిపాదించాలి.  కాగా.. ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు ఎంపీ శశిథరూర్‌, రాజస్థాన్ సీఎం  అశోక్‌ గెహ్లాట్ ల‌కు పార్టీ అధిష్టానం ఇప్ప‌టికే  ఆమోదం తెలిపింది. 
 
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్ష ఎన్నిక‌ల నామినేష‌న్ ప్ర‌క్రియ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న‌ది. ఫారం దాఖలు ప్రక్రియ సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30 వరకు కొనసాగనున్న‌ది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 8న చివరి తేదీగా ఉంచగా, అక్టోబర్ 17న ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 19న వెల్లడికానున్నాయి. 

ఈ నేప‌థ్యంలో ఎంపీ శశిథరూర్ పార్టీ అధ్యక్ష పదవికి సెప్టెంబర్ 30న నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే.. శ‌శిథ‌రూర్ ఐదు సెట్ల నామినేష‌న్ పత్రాల‌ను  సిద్ధం చేసుకుని.. వివిధ రాష్ట్రాల పార్టీ ప్ర‌తినిధుల‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే ప‌లు రాష్టాల ప్రతినిధులతో థరూర్ టచ్ లో ఉన్నట్లు సమాచారం.  

ఓటింగ్ ద్వారా నాలుగోసారి కాంగ్రెస్ చీఫ్ ఎన్నిక   

ఈసారి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల బ‌రిలో ఎంపీ శ‌శిథ‌రూర్, రాజస్థాన్ సీఎం  అశోక్‌ గెహ్లాట్ లు నిలువ‌నున్నారు. ఈ ఎన్నిక జరిగితే.. స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధినేతను ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం నాల్గవసారి అవుతుంది. ఏది ఏమైనప్పటికీ, తదుపరి కాంగ్రెస్ అధ్యక్షుడు గాంధేత‌ర కుటుంబానికి చెందిన‌ వ్యక్తి కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. 

ఈ ప‌రిణామం కూడా దాదాపు  24 సంవత్సరాల తర్వాత జ‌రుగనున్న‌ది.  దేశంలోని ఈ ప్రముఖ రాజకీయ కుటుంబం కాకుండా మరొకరు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ (స్వాతంత్యనంత‌రం) గాంధేత‌ర కుటుంబం నుంచి   పార్టీ అధ్యక్షుడుగా సీతారాం కేసరి బాధ్య‌తలు స్వీక‌రించారు. ఆ తర్వాత సోనియా గాంధీ పార్టీ అత్యున్నత పదవిని చేపట్టారు.

ఈసారి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, లోక్‌సభ సభ్యుడు శశిథరూర్ మధ్య ఎన్నికల పోటీ జరిగే అవకాశం ఉంది.  అయితే మరికొందరు అభ్యర్థులు బరిలోకి దిగే అవ‌కాశ‌మున్న‌ట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికలు జరిగినప్పుడు 9000 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు (ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు) ఓటు వేయనున్నారు. దేశంలో ప్రజాస్వామ్యయుతంగా అధ్యక్షుడిని ఎన్నుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు.

ఈసారి ఎన్నికల ప్రాధాన్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్  ప్రస్తావిస్తూ.. నేను కె.కె. ఏకాభిప్రాయంతో ఎన్నికలు జరగాలి, ఏకాభిప్రాయం కుదరకపోతే ఎన్నికలు తప్పనిసరి అని కామరాజు అభిప్రాయాలను నమ్మే వ్యక్తిని,  ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios