Asianet News TeluguAsianet News Telugu

మన పార్టీ చీఫ్ తాగుబోతు.. లంచాలు మెక్కుతాడు.. కాంగ్రెస్ నేతల సంభాషణలు లీక్.. పార్టీలో కలకలం

కాంగ్రెస్ పార్టీ మరో తలనొప్పిని తెచ్చుకున్నది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌పై పార్టీ నేతలే నోరుపారేసుకున్న ఆడియో, వీడియో క్లిప్ ఒక్కటి వైరల్ అవుతున్నది. శివకుమార్ మద్యం తాగుతాడని, అందుకే ఆయన మాట్లాడుతుండగా నత్తి వస్తుందని, ఆయన లంచాలు తీసుకుంటాడని పార్టీ నేతలు మాట్లాడుకుంటున్న క్లిప్ ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఏకంగా ప్రెస్ మీట్ వేదికపై ఇలా మాట్లాడుకుంటుండగా మైక్రోఫోన్‌లకు సంభాషణ చిక్కింది.
 

congress party leaders badmouthing chief DK Shiva kumar in leaked video clip
Author
Bengaluru, First Published Oct 13, 2021, 2:29 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బెంగళూరు: కాంగ్రెస్ కర్ణాటక యూనిట్ మరోసారి తనను తానే అవమానకర పరిస్థితిలోకి నెట్టుకుంది. పార్టీ నేతలే చీఫ్‌పై నోరుపారేసుకున్నారు. ఎక్కడే ప్రైవేటు రూమ్‌లోనో, మరో వ్యక్తిగత గదుల్లోనో కాదు.. ఏకంగా ప్రెస్ మీట్‌లోనే వారు గుసగుసలాడారు. వారి సంభాషణ మైక్రోఫోన్‌కు చిక్కాయి. ఆ video clip leak అయింది. ఇప్పుడు ఆ ఆడియో.. వీడియో రాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తున్నాయి.

Karnatakaలో Congress నేతలు ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. మరికాసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతున్నది. స్టేజీపై లోక్‌సభ మాజీ ఎంపీ వీఎస్ ఉగ్రప్ప, కర్ణాటక ప్రదేశ్ కమిటీ మీడియా కోఆర్డినేటర్ సలీమ్ అహ్మద్ సహా పలువురు కూర్చుని ఉన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు వీరిరువురూ జోరుగా గుసగుసలు పెట్టుకున్నారు. ఒకరిపైకి ఒకరు వంగి చెవులు కొరుక్కున్నారు. కానీ, ముందు microphoneలు ఉన్నాయని, వాటికి తమ సంభాషణ చిక్కవచ్చని కొద్దిసేపు మరిచిపోయారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ చీఫ్ DK Shiva Kumarపై నోరుపారేసుకున్నారు. శివకుమార్ ఓ కుంభకోణంలో భాగస్వామిగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయనతోపాటు ఆయన అనుచరులూ bribe తీసుకున్నారని మాట్లాడుకున్నారు. డీకే శివకుమార్ తాగుబోతు అని, అందుకే మాట నత్తిగా వస్తుందని ఆరోపణలు చేశారు.

Also Read: ఇజ్జత్‌ కా సవాల్..! అసెంబ్లీలో ఊడిన మాజీ సీఎం పంచె.. హీటెక్కిన సభలో నవ్వులు

లంచం గురించి మాట్లాడుతూ, ‘ఫస్టు అది ఆరు నుంచి ఎనిమిది శాతం ఉండేది. తర్వాత దాన్ని 10 నుంచి 12శాతానికి పెంచారు. ఇదంతా డీకే శివకుమార్ చేసిన మార్పులే. డీకే శివకుమార్ అనుచరుడు ముల్గుండ్ రూ. 50 నుంచి 100 కోట్లు కూడబెట్టుకున్నాడు. ముల్గుండ్‌కే ఇంత ఉంటే డీకే శివకుమార్ దగ్గర ఎంత ఉన్నదో ఊహించుకో’ అంటూ ఉగ్రప్పకు సలీమ్ అహ్మద్ చెబుతున్నట్టు ఆ క్లిప్ వివరిస్తున్నది.

అంతేకాదు, డీకే శివకుమార్ అసలు పార్టీకేమాత్రం పనికిరాడనీ మాట్లాడుకున్నారు. ‘డీకే శివకుమార్ అధ్యక్షుడు కావడానికి మనమంతా ఫైట్ చేశాం. కానీ, ఆయన మనల్ని, పార్టీని గాయపరుస్తున్నారు’ అని ఉగ్రప్ప అన్నారు. శివకుమార్ తరుచూ తాగుతాడా? అసలు ఆ నత్తికి కారణం తాగుడే కావచ్చు అని మాట్లాడుకున్నారు. మాజీ సీఎం సిద్దా రామయ్యతో శివకుమార్‌ను పోల్చారు.

‘డీకే శివకుమార్ మాట్లాడుతుండగా నత్తి వస్తుంటుంది. ఆయన లో బీపీ ఉన్నదా? లేక ఆయన తాగి మాట్లాడుతున్నాడా? నాకు అర్థమే కాదు. అదే మేం చర్చించాం. మీడియా కూడా అడిగింది. డీకే శివకుమార్ తాగి ఉన్నాడా? అని కానీ, అప్పుడు తాగలేదు. కానీ, సిద్ధా రామయ్య బాడీ లాంగ్వేజ్ ఏక్ దమ్ కడక్ ఉంటుంది’ అని సలీమ్ అహ్మద్ అన్నారు.

Also Read: ‘ఆధునిక మహిళలకు పెళ్లి, పిల్లలు ఒద్దు, సరోగసి కావాలి’.. కర్ణాటక మంత్రి విచిత్ర వ్యాఖ్యలు...

లీక్ అయిన ఈ వీడియో ఇప్పుడు కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తున్నది. కాగా, కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ వీటిపై ఇంకా స్పందించాల్సి ఉన్నది. డీకే శివకుమార్ వివాదాల్లో నిలవడం ఇది కొత్తేమీ కాదు. జులైలో నెలలో అనారోగ్యంతోనున్న ఓ పార్టీ ఎంపీని పరామర్శించడానికి వెళ్తుండగా పక్కనే ఉన్న ఓ కార్యర్త డీకే  శివకుమార్‌ను సమీపించారు. నడుస్తూ నడుస్తూ ఆయన భుజంపై చేయివేశాడు. అంతే, డీకే శివకుమార్ ఒక్కసారి ఉగ్రుడైపోయాడు. చేయి తీసేసే ఆ కార్యకర్త చెంప చెల్లుమనిపించాడు. ఇదంతా కెమెరాకు చిక్కింది.

Follow Us:
Download App:
  • android
  • ios