Congress: బీజేపీకి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే, అలాంటి అంశాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఖండించింది. వారిలో కొందరు పార్టీ శ్రేణుల్లోకి చొచ్చుకుపోయి తమ నాయకులతో ఫోటోలు తీయించుకున్నారని పేర్కొంది.
BJP’s terror links: ఉగ్రవాదులతో బీజేపీ నాయకులు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని భారతీయ జనత పార్టీ (బీజేపీ) పై విమర్శలు, ఆరోపణలు దాడులు మరింతగా పెంచింది. బీజేపీ నాయకులతో ఉగ్రవాదులకు సంబంధాలున్నాయనే విషయాలను బహిర్గతం చేయడానికి దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఉగ్రవాదం, ఉగ్రవాదులతో ఆరోపించిన సంబంధాలపై అధికార బీజేపీని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ శనివారం దేశంలోని 22 నగరాల్లో వరుస విలేకరుల సమావేశాలను నిర్వహించనుంది. బీజేపీ నకిలీ జాతీయవాద వాదనలను ఎదుర్కోవడమే లక్ష్యమనీ, క్రూరమైన నేరాలు, ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వ్యక్తులతో అధికార పార్టీకి సంబంధాలు ఉన్నాయనే సందేశాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. “ఈరోజు (శనివారం) 22 మంది సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధులు 22 నగరాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి బీజేపీతో ఉగ్రవాదులకు ఉన్న సంబంధాలను బయటపెడతారు” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ హిందీలో చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.
“బీజేపీకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి.. ఈ సంబంధాన్ని ఏమంటారు? అంటూ ట్వీట్‌లో ఫొటోలను షేర్ చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్ హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రియాజ్ అత్తారీ బీజేపీ సభ్యుడిగా ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించింది. రాజస్థాన్‌లోని బీజేపీ నేతలతో కలిసి ఉన్న ఫొటోలను కూడా విడుదల చేసింది. అయితే, అలాంటి అంశాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ఖండించింది. వారిలో కొందరు పార్టీ శ్రేణుల్లోకి చొచ్చుకుపోయి తమ నాయకులతో ఫోటోలు తీయించుకున్నారని పేర్కొంది. అలాగే, ఇటీవల శ్రీనగర్‌లోని రియాసి పట్టణంలో ప్రజలు పట్టుకున్న లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది తాలిబ్ హుస్సేన్ షా జమ్మూ కాశ్మీర్‌లోని బీజేపీ మైనారిటీ విభాగానికి ఆఫీస్ బేరర్ అని కాంగ్రెస్ పేర్కొంది. అయితే, దీనిని బీజేపీ నాయకత్వం ఖండించింది.
కాశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రపై దాడికి ప్లాన్ చేసిన తాలిబ్ హుస్సేన్ షా.. అమిత్ షాతో ఉన్న ఫోటోలో ఎలా కనిపించారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రశ్నించారు. ఇది భద్రతా ఉల్లంఘన కాదా అంటూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. అహ్మదాబాద్‌లో రాజ్యసభ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా, జైపూర్‌లో శక్తిసిన్హ్ గోహిల్, ముంబైలో అజోయ్ కుమార్, బెంగళూరులో ఉత్తర కుమార్ రెడ్డి, చెన్నైలో కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లం రాజు, మీడియా, పబ్లిసిటీ హెడ్ మీడియా సమావేశాలకు వెళ్లనున్న కాంగ్రెస్ అగ్రనేతలు. అలాగే, రాయ్‌పూర్‌లో పవన్ ఖేరా, కోల్‌కతాలో రాజీవ్ గౌడ, గౌహతిలో రంజీత్ రంజన్, విశాఖపట్నంలో సప్తగిరి శంకర్ లు కూడా మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు.
