నాలుగు లాక్‌డౌన్‌లతో ఏం సాధించారు: మోడీపై రాహుల్ విమర్శలు
ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శల వర్షం కురిపించారు. లాక్‌డౌన్‌తో వైరస్‌ను కట్టడి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం విఫలమైందని ఆయన ఆరోపించారు.
ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శల వర్షం కురిపించారు. లాక్‌డౌన్‌తో వైరస్‌ను కట్టడి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం విఫలమైందని ఆయన ఆరోపించారు.
మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడిన ఆయన... నాలుగు దశల లాక్‌డౌన్ ఎలాంటి ఫలితాలివ్వలేదని మండిపడ్డారు. కోవిడ్ 19 కేసులు ఎక్కువవుతున్న తరుణంలో ప్రపంచంలో ఆంక్షల్ని ఎత్తివేస్తున్న ఏకైక దేశం భారత్ అని రాహుల్ ఎద్దేవా చేశారు.
Also Read:భారత్ ని వణికిస్తున్న కరోనా .. నిన్న ఒక్కరోజే 7వేల కేసులు
వైరస్ రోజురోజుకీ విజృంభిస్తున్న నేపథ్యంలో దాని కట్టడికి కేంద్ర ప్రభుత్వం అనుసరించబోయే ప్రణాళికలేంటో వివరించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు, వలస కూలీలకు ఏ విధంగా సహకరిస్తుందో చెప్పాలని కోరారు.
భారతదేశంలో రెండో విడత కరోనా విజృంభిస్తే దాని పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రజల చేతుల్లోకి డబ్బు చేర్చాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Also Read:తల్లి కోసం విదేశాల నుంచి వచ్చి, క్వారంటైన్ లో ఉండగానే..
అలా చేయడని పక్షంలో పేదల జీవితాలు మరింత దుర్భర స్ధితిలోకి జారుకునే ప్రమాదం వుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజలతో పాటు పారిశ్రామక రంగానికి కూడా కేంద్రమే అండగా నిలవాలన్నారు.
లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు కేంద్ర సాయం ఎంతో అవసరమని.. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మనుగడ సాగించాలంటే కేంద్ర ప్రభుత్వం కష్టతరమవుతుందని ఆయన చెప్పారు.