తల్లి కోసం విదేశాల నుంచి వచ్చి, క్వారంటైన్ లో ఉండగానే..
దుబాయ్‌లో ఉద్యోగం వదిలిపెట్టి, అనారోగ్యం బారినపడిన తల్లిని చూసేందుకు వచ్చిన ఆ కుమారుడు తన కన్నతల్లిని కడసారి కూడా చూసుకోలేకపోయాడు. ఆరేళ్ల క్రితం ప్రొడక్ట్ కన్సల్టెంట్‌గా దుబాయ్ వెళ్లిన 30 ఏళ్ల అమీర్ ఖాన్ తల్లి శనివారం మరణించించింది
కరోనా మహమ్మారి కారణంగా ఓ తల్లి తన కొడుకుని చివరి సారి కూడా నోచుకోలేకపోయింది. విదేశాల్లో ఉన్న కొడుకు స్వదేశానికి వచ్చినా.. తన వద్దకు రాలేకపోయాడు. క్వారంటైన్ పేరిట ఆగిపోవాల్సి వచ్చింది. కానీ.. ఆ కొడుకును చూసేందుకు పరితపించిన తల్లి.. చూడకుండానే కన్నుమూసింది. ఈ విషాదకర సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దుబాయ్‌లో ఉద్యోగం వదిలిపెట్టి, అనారోగ్యం బారినపడిన తల్లిని చూసేందుకు వచ్చిన ఆ కుమారుడు తన కన్నతల్లిని కడసారి కూడా చూసుకోలేకపోయాడు. ఆరేళ్ల క్రితం ప్రొడక్ట్ కన్సల్టెంట్‌గా దుబాయ్ వెళ్లిన 30 ఏళ్ల అమీర్ ఖాన్ తల్లి శనివారం మరణించించింది. రాంపూర్‌లో ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కూడా అమిర్‌ఖాన్ హాజరుకాలేకపోయాడు.
మే 13న భారత్‌కు వచ్చిన అమిర్‌ఖాన్ ఢిల్లీలోని ఒక హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నాడు. ఈ కారణంగా తల్లిని కడసారి కూడా చూసుకోలేకపోయాడు. ఈ సందర్భంగా అమిర్‌ఖాన్ మాట్లాడుతూ క్వారంటైన్‌లో ఎనిమిదవ రోజు తాను ఎస్‌డిఎం కార్యాలయ ప్రతినిధితో తన తల్లిని చూడటం తనకు చాలా ముఖ్యమని కోరగా, వారు ఇందుకు ప్రత్యేక అనుమతి అవసరమని చెప్పారన్నారు. ఇంతలో తల్లి మృతి చెందిందని తనకు తెలిసిందని, అప్పుడు కూడా తన తల్లి అంత్యక్రియలకు వెళ్ళనివ్వాలని అధికారులను వేడుకున్నా, వారు తనను వెళ్లనివ్వలేదని రోదిస్తూ తెలిపాడు.