న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకొన్న సంక్షోభం రాజస్థాన్ రాజకీయాలను వేడెక్కించింది. డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ తో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంప్రదింపులు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించారు. తనకు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సీఎం ఆశోక్ గెహ్లాట్‌ వర్గం ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షం ఇవాళ సమావేశమైంది. ఈ సమావేశానికి 20 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.సీఎల్పీ సమావేశానికి 97 మంది మాత్రమే హాజరయ్యారని ప్రచారం సాగుతోంది. ఈ సమావేశానికి ఇ్దరు మంత్రులు కూడ దూరంగా ఉన్నారని సమాచారం. 

also read:రాజస్థాన్ కాంగ్రెస్‌లో సచిన్ కలకలం: ఎమ్మెల్యేలతో ఢిల్లీకి పైలెట్

సీఎం ఆశోక్ గెహ్లాట్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసింది సీఎల్పీ సమావేశం. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పార్టీ నేతలు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఈ సమావేశం తీర్మానించింది. 

సీఎం ఆశోక్ గెహ్లాట్ నివాసంలో సోమవారం నాడు జరిగింది. ఈ సమావేశం తర్వాత తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలను సీఎం గెహ్లాట్ రిస్టార్స్ కు తరలించారు. మరో వైపు డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ తో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు చర్చించారు.  తనతో సమావేశం కావాలని రాహుల్ గాంధీ సచిన్ పైలెట్ ను కోరారు.

తాను సచిన్ పైలెట్ తోనే ఉన్నట్టుగా మంత్రి రమేష్ మీనా ప్రకటించారు. సచిన్ పైలెట్ తన డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు ఉంచినట్టుగా తెలుస్తోం