ముంబై: తాను ఎన్సీపీలోనే ఉన్నాను, భవిష్యత్తులో కూడ ఎన్సీపీలోనే కొనసాగుతానని ఎన్సీపీ ఎమ్మెల్యే అజిత్ పవార్ స్పష్టం చేశారు. ఇందులో గందరగోళం సృష్టించడానికి ఏమీ లేదన్నారు.

తాను చెప్పడానికి ఇప్పుడేమీ లేదన్నారు. కానీ, సరైన సమయంలో తాను అన్నీ విషయాలను మాట్లాడుతానని అజిత్ పవార్ తేల్చి చెప్పారు.ఇంతకు ముందే తాను చెప్పాను .. తాను ఎన్సీపీలోనే ఉన్నాననే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మంగళవారం రాత్రిపూట ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసానికి  అజిత్ పవార్ చేరుకొన్నారు. తమ నాయకుడి ఇంటికి వెళ్లడం, ఆయనను కలవడంలో తప్పేమీ ఉందని ఆయన ప్రశ్నించారు.

మహారాష్ట్రలోని పూణెలోని భారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్సీపీ నుండి  అజిత్ పవార్ విజయం సాధించాడు.  అజిత్ పవార్ తన ప్రత్యర్ధిపై 1.65 లక్షల మెజారిటీ ఓట్లతో విజయం సాధించాడు.

ఈ నెల 23వ తేదీన బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. మూడు రోజులకే ఆయన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు.  ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు.

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. మహారాష్ట్ర సీఎంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే  ప్రమాణం చేయనున్నారు. రేపు ఉద్దవ్ ఠాక్రే  సీఎంగా ప్రమాణం చేయనున్నారు.