విరాట్ కోహ్లీపై శశిథరూర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆయన చేసిన ట్వీట్‌లో ఓ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నది. దీంతో నెటిజన్లు అది నిజంగా తప్పేనా? లేక స్వతహాగా అదొక పదమా? అనే డైలమాలో పడ్డారు. 

న్యూఢిల్లీ: పాకిస్తాన్ పై ఇండియా క్రికెట్ జట్టు వీరోచిత ఆటను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశిథరూర్ కూడా ఆదివారం టీమిండియాపై మరీ ప్రత్యేకంగా విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. కోహ్లీపై ఆయన ట్వీట్ చూసి నెటిజన్లు మాత్రం ఖంగారు పడ్డారు. 

గోవాలో కాథలిక్ యూనివర్సిటీల్లో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన తర్వాత గోవా నుంచి ఫ్లైట్‌లో బయల్దేరి రావాల్సిందని వివరించారు. కానీ, ఆ ఫ్లైట్‌లో వస్తే తాను ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మిస్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఆ తర్వాతి ఫ్లైట్ రాత్రి 9.55 గంటలకు ఉన్నదని తెలుసుకుని కావాలనే తన షెడ్యూల్డ్ ఫ్లైట్ మిస్ చేసుకున్నారని వివరించారు. ఇండియా, పాకిస్తాన్‌ల మ్యాచ్ చూడటానికి తాను థ్రిల్ అయ్యాడని పేర్కొన్నారు.

మరో ట్వీట్‌లో ఆయన విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. విరాట్ కోహ్లీ జీనియస్, ఆథెంటిక్ హీరో అని ప్రశంసించారు. అట్లర్లీ ఆసమ్ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ చూసి చాలా మంది నెటిజన్లు కంప్లైంట్స్ ఇచ్చారు.

Also Read: IND vs PAK: పాకిస్తాన్ ట్రోలర్‌కు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్

విరాట్ కోహ్లీని ప్రశంసించిన ట్వీట్‌లో శశిథరూర్ ఆథెంటిక్ అనే పదం స్పెల్లింగ్ తప్పుగా టైప్ చేశారు. అందులో ఎన్ అనే ఆంగ్ల అక్షరం మిస్ అయింది. ఇది చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఇంగ్లీష్‌లో విశేష ప్రావీణ్యం ఉన్న శశిథరూర్ తప్పుగా టైప్ చేస్తారా? లేక అది వేరే ఇంకేదో పదం అయి ఉంటుంది అనే చర్చ చేశారు.

‘సర్, దయచేసి ఆథెటిక్ మీనింగ్ తెలుపండి. నాకు దాని అర్థం దొరకట్లేదు’ అని ఒకాయన ట్వీట్ చేశారు. మరొకరు శశిథరూర్ ఆథెంటిక్ స్పెల్లింగ్ తప్పుగా రాశారు అని వివరించారు. మరొకరు కామెంట్ చేస్తూ.. శశిథరూర్ ట్వీట్‌లో తాను ఒక టైపోను కనిపెట్టాననుకోవడం ఆశ్చర్యకరంగా ఉన్నదని పేర్కొన్నారు. కానీ, ఈ సందర్భంలో ఆథెటిక్ అనేది ఒక నిజమైన పదంగా, గోచరిస్తున్నదని వివరించారు.

దీనికి శశిథరూర్ రియాక్ట్ అయ్యారు. తనను రక్షించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ పేర్కొన్న శశిథరూర్.. అయ్యో.. అది తప్పుగానే టైప్ చేశానే అంటూ ట్వీట్ చేశారు.