గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ దీపావళిని నిన్నటి మ్యాచ్‌లో చివరి మూడు ఓవర్లు చూస్తూ ఎంజాయ్ చేశాడు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఆయన ఈ ట్వీట్ చేశారు. దీనికి ఓ పాకిస్తాన్ ట్రోలర్ అడ్డుతగలబోయాడు. కానీ, ఆ ట్రోలర్‌కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. 

న్యూఢిల్లీ: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ దీపావళిని ఆస్ట్రేలియాలో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మరోసారి చూస్తూ ఎంజాయ్ చేశానని పేర్కొన్నారు. దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. అందులోనే తాను ఈ రోజు నిన్నటి మ్యాచ్‌లో చివరి మూడు ఓవర్లు మళ్లీ చూస్తూ ఎంజాయ్ చేశానని పేర్కొన్నారు. వాట్ ఎ గేమ్.. వాట్ ఎ పర్ఫార్మెన్స్ అంటూ టీమిండియాపై ప్రశంసలు కురిపించారు. ఈ ట్వీట్‌కు ఓ పాకిస్తాన్ ట్రోలర్ అడ్డుతగిలాడు. ఆ ట్రోలర్‌కు పిచాయ్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు.

దీపావళికి శుభాకాంక్షలు చెబుతూ సుందర్ పిచాయ్ చేసిన ట్వీట్‌కు ఓ పాకిస్తాన్ ట్రోలర్ అడ్డుతగిలాడు. చివరి మూడు ఓవర్లు కాదు.. మొదటి మూడు ఓవర్లు చూడాల్సింది అంటూ కామెంట్ చేశాడు. అందుకు సుందర్ పిచాయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ పని కూడా చేశా అని సమాధానం ఇచ్చారు. భువీ, అర్షదీప్‌లు అద్భుత పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని కౌంటర్ ఇచ్చారు.

Scroll to load tweet…

సుందర్ పిచాయ్ ఫస్ట్ మూడు ఓవర్‌లలో భారత బౌలర్లను పరోక్షంగా పేర్కొన్నారు. ఆ మూడు ఓవర్లలో అర్షదీప్.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, మరో పాకిస్తాన్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్‌లను పెవిలియన్‌కు పంపించారు. ఈ అద్భుత బౌలింగ్‌ను ఆయన పేర్కొన్నారు. దీంతో పాకిస్తాన్ ట్రోలర్‌కు తిక్క కుదిరింది.

Scroll to load tweet…

సుందర్ పిచాయ్ తన ట్వీట్‌లో పేర్కొన్న చివరి మూడు ఓవర్లలో టీమిండియా 48 పరుగులు సాధించింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒత్తిడిలోనూ అద్భుతంగా రాణించాడు. క్రీజులో పాతుకుపోయి బంతులను బౌండరీలకు తరలించాడు. పరుగులు సాధించే మెషీన్‌గా అవతారమెత్తాడు. కొన్నాళ్లపాటు ఫామ్ కోల్పోయి అవస్థలు పడ్డ కోహ్లీ.. ఈ ఇన్నింగ్స్‌తో కింగ్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.