కర్ణాటక శాసన సభ ఎన్నికల వేళ బీజేపీకి కన్నడ సినీ నటుడు కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) మద్దతు ప్రకటించడంపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ఈ అంశంపై కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా మాట్లాడుతూ.. కర్ణాటక భవితవ్యాన్ని ప్రజలే నిర్ణయిస్తారని, సినీ తారలు కాదని కాంగ్రెస్‌ నేత పునరుద్ఘాటించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి విశేష మద్దతు లభిస్తుంది. తాజాగా ప్రముఖ కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్(Kannada actor Kichcha Sudeep) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మైతో(CM Basavaraj Bommai) కలిసి బెంగళూరులో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తానని నటుడు సుదీప్ చెప్పారు. సీఎం బొమ్మైతో తనకు ఉన్న అనుబంధంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అయితే.. తాను రాజకీయాల్లోకి రాబోననీ, కేవలం బీజేపీకి మద్దతు ప్రకటిస్తాననీ, బీజేపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తానని తెలిపారు. తనకు బీజేపీ సిద్ధాంతం నచ్చుతుందని స్పష్టం చేశారు.

బీజేపీకి కన్నడ సినీ నటుడు కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) మద్దతు ప్రకటించడంపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ఈ అంశంపై కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా మాట్లాడుతూ.. సినీ నటుడు ఎవరికి మద్దతివ్వాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉందని, అయినా.. కర్ణాటక భవితవ్యాన్ని ప్రజలే నిర్ణయిస్తారని, సినీ తారలు కాదని సూర్జేవాలా పునరుద్ఘాటించారు. సినీ తారలు పూర్తిగా స్వతంత్రులని, ఎవరికి కావాలంటే వారికి మద్దతు ఇవ్వగలరని సూర్జేవాలా అన్నారు.

కొన్నిసార్లు ఈ ప్రమోషన్ IT , ED లేదా మరేదైనా కావచ్చు. కర్నాటకలో బీజేపీ పొత్తు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కర్ణాటకలో బిజెపి దివాళా తీయడం ఖాయమనీ, సిఎం బొమ్మై,బీజెపి నాయకుల మాట వినడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో.. వారు కొత్త డ్రామాకు తెర తీశారనీ, అందుకే సినీ తారలపై ఆధారపడుతున్నారని, కర్ణాటక భవితవ్యాన్ని నిర్ణయించేది ప్రజలే, సినీ తారలు కాదు సుర్జేవాలా ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

కాంగ్రెస్ ట్వీట్‌పై బీజేపీ స్పందిస్తూ.. నటుడికి వచ్చిన బెదిరింపు మెయిల్ వెనుక గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఉందా అని ప్రశ్నించింది. ఆదివాసి సామాజికవర్గానికి చెందిన సినీనటుడు సామాజిక న్యాయం కోసం బిజెపిని సమర్థించడాన్ని కాంగ్రెస్‌ వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మరుక్షణంలో ఆయనకు బెదిరింపు లేఖ పంపినందుకు మీకు ఏమైనా సంబంధం ఉందా?" అని కర్ణాటక బీజేపీ ట్వీట్‌లో ప్రశ్నించింది.

Scroll to load tweet…

గతంలో నటుడు కిచ్చా సుదీప్ .. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను కలిశారని, ఆ సమయంలో కిచ్చ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇది వ్యక్తిగత సమావేశమని, దానితో రాజకీయాలకు సంబంధం లేదని వారిద్దరూ స్పష్టం చేశారు. ఇప్పుడు కిచ్చా బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా దీనిపై ఘాటుగా స్పందించారు. 

నటుడు ప్రకాష్ రియాక్షన్ 

భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేస్తానని కిచ్చా సుదీప్ ప్రకటించిన తీరు నాకు బాధగా ఉందని సూపర్ స్టార్ ప్రకాష్ రాజ్ అన్నారు. ఆయన తన స్పందనను తెలియజేస్తూ.. కిచ్చా సుదీప్ మాటలు తనని ఆశ్చర్యం, దిగ్భ్రాంతికి గురి చేశాయని అన్నారు. కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతున్నారనే వార్తలపై ప్రకాష్ రాజ్ అంతకుముందు ట్వీట్ చేస్తూ.. ఇది కర్ణాటకలో నిరాశకు గురైన బీజేపీ చేసిన ఫేక్ న్యూస్ అని తాను గట్టిగా నమ్ముతున్నాననీ, కిచ్చా సుదీప్ సున్నితమైన వ్యక్తి , ఆయన బీజేపీలో చేరబోడని తెలిపారు.

నటుడికి బెదిరింపు లేఖ 

కిచ్చా సుదీప్ కన్నడ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ విభిన్నమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో, అతను బిజెపి పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి, అయితే ఇంతలో నటుడికి బెదిరింపు లేఖ వచ్చింది.

ఈ లేఖను ఎవరు పంపారో నాకు తెలుసు - కిచ్చ

వాస్తవానికి, నాకు ఒక లేఖ వచ్చింది. ఎవరు పంపారో నాకు తెలుసు. ఇది పరిశ్రమకు చెందిన వ్యక్తి చేసిన పని అని నాకు తెలుసు అని అన్నారు. నేను వారికి తగిన సమాధానం ఇస్తాను. నా కష్టకాలంలో నాకు అండగా నిలిచిన వారి కోసం పనిచేస్తాను. అని నటుడు కిచ్చా సుదీప్ చెప్పాడు. 

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు 

 నటుడు కిచ్చ మేనేజర్‌కి బుధవారం ఓ లేఖ అందింది. ఆ లేఖలో కిచ్చా ప్రైవేట్ వీడియోని సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరింపు లేఖ వచ్చిందని మేనేజర్ చెప్పాడు. ఈ లేఖ అందుకున్న తర్వాత పుట్టెనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కర్ణాటక పోలీసులు ఐపీసీ 120బి, 506, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో పాటు కేసు విచారణ కూడా మొదలైంది.

ఇదిలా ఉంటే.. మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు మే 10న మాత్రమే ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.