Asianet News TeluguAsianet News Telugu

అజ్ఞానం కంటే అహంభావం ప్రమాదకరం: మోడీని ఉద్దేశిస్తూ రాహుల్ వ్యాఖ్యలు

దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతుండటంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అల్బెర్ట్ ఐన్‌స్టీన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్రమోడీని విమర్శించారు.

Congress leader rahul gandhi attacked centre over rising covid cases
Author
New Delhi, First Published Jun 15, 2020, 9:16 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతుండటంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అల్బెర్ట్ ఐన్‌స్టీన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్రమోడీని విమర్శించారు.

అజ్ఞానం కంటే అహంభావం మరింత ప్రమాదకరమని లాక్‌డౌన్ నిరూపించిందని ఐన్‌స్టీన్ గతంలో చెప్పిన కోట్‌ను ప్రస్తావిస్తూ రాహుల్ ట్వీట్ చేశారు. దీనితో పాటు కోవిడ్ 19 మరణాలు పెరగడం, ఆర్ధిక వ్యవస్ధ నిర్వీర్యమవుతున్న తీరును వివరించే లైఫ్‌గ్రాఫ్‌ను కూడా యువనేత పోస్ట్ చేశారు.

Also Read:50 వేలకు చేరువలో కరోనా కేసులు: తమిళనాడులో 19 నుంచి మళ్లీ లాక్‌డౌన్

దేశవ్యాప్తంగా కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేయడంతో ఆర్ధిక వ్యవస్థను తీవ్ర ప్రభావానికి లోనైందని ఆయన విరుచుకుపడ్డారు. కోవిడ్ 19తో ఆర్ధిక వ్యవస్ధ ఎదుర్కొనే ప్రతికూల ప్రభావంపై రాహుల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేథావులు, విధాన నిర్ణేతలతో మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.

రాహుల్ ఇప్పటి వరకు ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ, పారిశ్రామికవేత్త రాజీవ్ బజాజ్, అమెరికన్ దౌత్యవేత్త నికోలస్ బర్న్స్‌, హార్వర్డ్ ప్రొఫెసర్ ఆశిష్ ఝా, స్వీడన్ వైద్యులు జోహన్‌ గికీలతో మాట్లాడారు.

Also Read:మరోసారి లాక్‌డౌన్ ఆలోచన లేదు: తేల్చేసిన కేజ్రీవాల్

వీరితో సంప్రదింపులు జరిపే క్రమంలో కోవిడ్ 19ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు.. ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాల గురించి విస్తృతంగా చర్చించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios