మధ్యప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసిన హరినారాయణ్ 14 ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థిపై ఓడిపోయారు. ఈ ఓటమి వార్త వినగానే కాంగ్రెస్ లీడర్ హరినారాయణ్ హార్ట్ అటాక్‌కు గురై మరణించారు.
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ కాంగ్రెస్ నేత అకాల మరణం చెందారు. మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో కేవలం 14 ఓట్ల తేడాతో మరణించిన వార్త ఆయనకు చేరిన తర్వాత గుండె పోటుతో మృతి చెందారు. ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. రేవా జిల్లాలో కాంగ్రెస్ నేత హరినారాయణ్ గుప్తా ఈ ఎన్నికల్లో బరిలో దిగారు. తాను తప్పకుండా గెలుస్తాననే ధీమాతో ఆయన ఉన్నారు. హనుమాన మండల కాంగ్రెస్ యూనిట్ అధ్యక్షుడు ఇతనే. రేవా జిల్లాలోని హనుమానా ఏరియా మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో 9వ వార్డు నుంచి ఆయన కాంగ్రెస్ టికెట్‌పై బరిలోకి దిగారు.
కానీ, ఆయనకు ఊహించిన షాక్ తగిలింది. ఈ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగిన వ్యక్తి 14 ఓట్ల ఆధిక్యంతో హరినారాయణ్‌పై గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిపై ఓడిపోయినట్టుగా తాను వార్త వినగానే.. హరినారాయణ్ హార్ట్ ఎటాక్‌తో మరణించారు. మధ్యప్రదేశ్‌లో ఆదివారం స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రకటించారు.
జులై 6వ తేదీ, 13వ తేదీల్లో మధ్యప్రదేశ్‌లో 413 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. 298 నగర పరిషత్‌లలోనూ ఎలక్షన్స్ జరిగాయి. వీటిని ఎన్నికల సంఘం రెండు దశల్లో నిర్వహించింది.
ఈ ఎన్నికల ప్రకారం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బుర్హన్‌పూర్, సత్నా, కాండ్వా, సాగర్ జిల్లాల్లో విజయపతాకం ఎగరేసింది. కాగా, సింగ్రౌలీలో గెలుపొంది ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ బోణీ కొట్టింది.
