Bhopal: కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కారు ఒక బైకును ఢీ కొట్టింది. దిగ్విజయ్ సింగ్ కారు వస్తున్న క్రమంలో అకస్మాత్తుగా బైకర్ టర్న్ తీసుకునే సమయంలో కారు ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే దిగ్విజయ్ సింగ్ కారు దిగి బాధితుడి వద్దకు చేరుకున్నట్టు సీసీసీటీ దృశ్యాల్లో కనిపించింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Congress leader Digvijaya Singh's car hit the biker: కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కారు ఒక బైకును ఢీ కొట్టింది. దిగ్విజయ్ సింగ్ కారు వస్తున్న క్రమంలో అకస్మాత్తుగా బైకర్ టర్న్ తీసుకునే సమయంలో కారు ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే దిగ్విజయ్ సింగ్ కారు దిగి బాధితుడి వద్దకు చేరుకున్నట్టు సీసీసీటీ దృశ్యాల్లో కనిపించింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ లో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కారు బైక్ ను ఢీకొట్టింది. బైకర్ రాంబాబు బాగ్రి(20)కి గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఎదురుగా వస్తున్న బైకర్ అకస్మాత్తుగా ఆగకుండా కుడి మలుపు తిరగడంతో.. అదే సమయంలో వచ్చిన కారు ఢీ కొట్టినట్టు సీసీటీవీ సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. సింగ్ ప్రయాణిస్తున్న టయోటా ఫార్చ్యూనర్ కారు అతివేగంతో వెళ్తుండగా బైక్ ను ఢీకొట్టడంతో బైకుపై నుంచి ఆ వ్యక్తి కిందపడిపోయాడు.
ప్రమాదం జరిగిన వెంటనే మొదట కారు దిగి దిగ్విజయ్ సింగ్.. బాధితుడి వద్దకు పరుగెత్తారు. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి భోపాల్ లోని ఆస్పత్రికి తరలించారు. రాజ్ పూర్ లోని పరోలియాకు చెందిన బైకర్ తలకు గాయమైందని జిరాపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ మనోజ్ గుప్తా తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనీ, సీటీ స్కాన్ కోసం భోపాల్ లోని చిరాయు ఆస్పత్రికి తరలించామని తెలిపారు. కాగా, దిగ్విజయ్ సింగ్.. కొడాక్యా గ్రామంలోని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ పురోహిత్ తల్లి ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. కొద్ది సమయం తర్వాత రాజ్ గఢ్ కు బయలుదేరారు. మార్గమధ్యంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
దిగ్విజయ్ సింగ్ కారు డ్రైవర్ అక్తర్ ఖాన్ ను స్థానిక పోలీసులు అరెస్టు చేసి కారును సీజ్ చేశారు.
