అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను బీపీలవుడ్ ఫేమస్ విలన్ మొగాంబో తో పోల్చారు లోక్ సభ ప్రతిపక్షనేత అధిర్ రంజాన్ చౌదరి. ఇన్ని కోట్లు ఖర్చుపెట్టేది ఆ మొగాంబోను సంతోష పరచడానికి అంటూ... మొగాంబో ఖుష్ హువా అనే ఫేమస్ డైలాగ్ ను జ్ఞప్తికి తెచ్చారు ఈ సీనియర్ కాంగ్రెస్ ఎంపీ. 

ట్రంప్ రావడం చాలా గొప్ప విషయమేనని, కానీ ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఎందరో మురికివాడల్లో ఉంటున్నవారందరిని కనబడకుండా దాచివేస్తూ... ఇలా ఆయనకోసం ఇంత ఖర్చుపెట్టడం భావ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇదంతా ఆ మొగాంబో సంతోషం కోసమే అని ఎద్దేవా చేసారు. 

Also read; డోనాల్డ్ ట్రంప్ రాకపై ఆర్జీవీ సెటైర్.... కడుపు చెక్కలవ్వాల్సిందే!

ప్రపంచంలో అత్యంత పురాతనమైన ప్రజాస్వమ్యం వారిదైతే... అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత అని... అలంటి దేశంలో అందరికి సమానమైన గౌరవం ఇవ్వాలని ట్రంప్ తో అధికారిక డిన్నర్ కి సోనియా గాంధీని పిలవకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. 

ఇలా సోనియాగాంధీని పిలవకపోవడం వల్లే తాను తనకు అందిన విందు ఆహ్వానాన్ని వెనక్కి పంపినట్టు చెప్పారు. అమెరికాలో హౌడీ మోడీ ఈవెంట్ అయితే... అక్కడ ట్రంప్ తోపాటు ప్రతిపక్ష డెమొక్రాట్లు కూడా వేదికపైకి వచ్చారని... వారు కూడా మాట్లాడారని ఆయన గుర్తుచేశారు. 

కానీ ఇక్కడ భారత దేశంలో మాత్రం ప్రతిపక్షాలు అన్న ఊసే లేకుండా ఆయన ఒక్కడే వేదికను ట్రంప్ తో పంచుకుంటున్నాడని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసారు. ప్రపంచంలో అత్యంత బలమైన దేశంగా పరిగణించే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత దేశానికి రావడం గొప్పవిషయమని, దాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందని కూడా ఈ సందర్భంగా అధిర్ రంజాన్ చౌదరి అన్నారు. 

Also read; ట్రంప్ పర్యటన: అమెరికా అధ్యక్షుడికి ఇష్టమైన ఫుడ్స్ ఏమిటో తెలుసా?

రెండు రోజుల పర్యటన నిమిత్తం ట్రంప్ రేపు అహ్మదాబాద్ లో దిగనున్నారు. అక్కడ నమస్తే ట్రంప్ ఈవెంట్ లో పాల్గొని... సాయంత్రానికి ఆగ్రా సందర్శనానికి వెళ్తారు. అక్కడి నుండి తెల్లారి ఢిల్లీలో అధికారిక సమావేశాల్లో పాల్గొంటారు. 25వ తేదీన రాత్రి ఢిల్లీ నుండి బయల్దేరి వాషింగ్టన్ వెళ్ళిపోతారు.