ప్రధాని నరేంద్రమోడీపై జైరామ్ రమేష్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ సింగ్వి శుక్రవారం సమర్థించారు, ప్రధానిని దెయ్యంగా చూపించడం తప్పని ఆయన చర్యలను వ్యక్తిగతంగా కాకుండా సమస్యల వారీగా నిర్ణయించాలన్నారు.

ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు చేరువయ్య రీతిలో మోడీ మాట్లాడతారని... ప్రజలు గుర్తించే రీతిలో ఆయన పనితీరు ఉండటం వల్ల ప్రధానిని ప్రస్తుత పరిస్ధితుల్లో ఎదుర్కోవడం కష్టమని అభిప్రాయపడ్డారు.

మనమంతా రైతులు కష్టాల్లో ఉన్నారని ఆందోళన చేస్తుంటామని... అయితే రైతుల కష్టాలకు, మోడీకి ఎలాంటి సంబంధం లేదని జనం భావిస్తున్నారని రమేశ్ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్రమోడీని అన్ని వేళలా భూతంలా చూపించలేమని... అలా చేస్తే ఆయనను ఏమాత్రం ఎదుర్కోలేమన్నారు.

మోడీ విధానం పూర్తిగా వ్యతిరేకంగా ఏమీలేదని... మోడీ ప్రభుత్వ ఆర్ధిక విధానాన్నే తీసుకుంటే గతంలో కంటే ఎంతో భిన్నంగా ఉందని జైరాం ప్రశంసించారు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన ప్రధానిగా మోడీకి మంచి పేరు తెచ్చిపెట్టిందని రమేశ్ తెలిపారు.

2014-19 మధ్య మోడీ పనితీరు.. 2019 ఎన్నికల్లో 37 శాతానికి పైగా ఓట్లతో ఎన్డీయేను మరోసారి అధికారంలోకి తెచ్చిందని జైరాం రమేశ్ గుర్తుచేశారు. తాజాగా రమేశ్ వ్యాఖ్యలను సింఘ్వీ సమర్థించడంతో కాంగ్రెస్‌లో కలకలం రేగింది. 

కాంగ్రెసుకు షాక్: మోడీపై జైరాం రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు