BJP chief Nadda: కాంగ్రెస్ జాతీయ పార్టీ హోదాను త్వరలో కోల్పోతుందనీ, ఆ పార్టీ కేవలం అన్నాచెల్లెళ్ల పార్టీ అని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలన్ని కుటుంబ పార్టీలు అయ్యాయని, బీజేపీ మాత్రమే జాతీయ పార్టీ అని విమర్శించారు.
BJP chief Nadda: కాంగ్రెస్ పార్టీ జాతీయం కాదని, ఆ పార్టీ కేవలం అన్నా చెల్లెళ్ల పార్టీ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. కాంగ్రెస్ ఇంకెంత మాత్రం జాతీయ పార్టీగా ఉండబోదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ను అన్నాచెల్లెళ్ల పార్టీ అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పరోక్షంగా.. విమర్శించారు. రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ప్రచారాన్ని ప్రారంభిస్తూ.. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. శుక్రవారం అహ్మదాబాద్‌లో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
]కాంగ్రెస్‌పై విరుచుకుపడిన నడ్డా.. కాంగ్రెస్ ఇప్పుడు జాతీయ పార్టీ కాదనీ, ఆ పార్టీ కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే ఉందని, ఆ పార్టీ కేవలం అన్నా చెల్లెళ్ల పార్టీ అని, కాంగ్రెస్ కొద్ది రోజుల్లోనే జాతీయ హోదా కోల్పోనుందని ఆయన జోస్యం చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగా మారాయని, మన దేశంలో మరో జాతీయ రాజకీయ పార్టీ లేదనీ, బిజెపి మాత్రమే మిగిలి ఉందని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్, యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీలను పరోక్షంగా విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలోనూ ఇదే పరిస్థితి ఉందని అన్నారు. అలాగే.. తమిళనాడులో డీఎంకే కుటుంబ పార్టీగా మారిందనీ, అలాగే.. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ లు కూడా ప్రాంతీయ పార్టీలు కావనీ, కుటుంబ పార్టీలుగా మారాయని విమర్శించారు. నడ్డా గుజరాత్ పర్యటనలో భాగంగా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలతోసమావేశమయ్యారు. గాంధీనగర్, వడోదర, అహ్మదాబాద్ నగరాల్లో ఆయన పర్యటించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈ డిసెంబర్‌లో జరగనున్నాయి.
