కాంగ్రెస్ పార్టీ మానసికంగా  దివాళా తీయించిందని, ప్రధాని నరేంద్ర మోదీపై వ్యతిరేకతతో ఆ పార్టీ దేశాన్ని వ్యతిరేకిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు.

కాంగ్రెస్ మానసిక దివాళా తీసిందని, ప్రజాస్వామ్యంలో పనిచేసే అర్హత లేదని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పేర్కొన్నారు. ఆయన గురువారం బెంగళూరులో పర్యటించారు. ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మానసిక దివాళా తీసిందని, ప్రజాస్వామ్యంలో పనిచేసే సామర్థ్యం కాంగ్రెస్‌కు లేదని ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ 'భారత్ తోడో యాత్ర' పని చేస్తుందని కూడా ఆయన ఆరోపించారు.

ఇటీవల బ్రిటన్‌లో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై నడ్డా స్పందించారు. రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించకుండా.. "ఇటీవల దేశంలో జరిగిన 'భారత్ జోడో యాత్ర'లో ఎవరూ అతనిని వినలేదు, అందుకే అతను ఈ రోజుల్లో ఇంగ్లాండ్‌లో ప్రసంగాలు ఇస్తున్నాడు." మోదీని ఎదిరించేందుకే ఈ వ్యక్తులు (కాంగ్రెస్) ఇప్పుడు దేశాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. అతను భారత్ జోడో యాత్రను ప్రారంభించాడు. అయితే బ్రేక్ ఇండియా యాత్రను చేశాడు. 

జేడీ(ఎస్), కాంగ్రెస్‌లు ఒకే నాణేనికి రెండు ముఖాలుగా అభివర్ణించిన నడ్డా.. ఇరు పార్టీలు అవినీతి, కుటుంబ పాలన, విభజన రాజకీయాలు, విభజించి పాలించడం, కమిషన్, అవినీతి, కులతత్వం, మతతత్వవాదాన్ని నమ్ముతాయని అన్నారు. జేడీ(ఎస్) కుటుంబ పాలనను నమ్ముతే.. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబానికే పరిమితమైందని ఎద్దేవా చేశారు. 

అలాగే కాంగ్రెస్ నేతలందరూ బెయిల్‌పై బయట ఉన్నారనీ, వారు అవినీతి, కమీషన్‌లకు పాల్పడ్డారని, అదేవిధంగా జేడీ(ఎస్) కూడా అవినీతిలో పాల్గొందని అన్నాడు. ఇరు పార్టీలవారు సోదరులలాంటి వారు. JD(S)కి ఓటు వేయడం అంటే కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమేననీ, కాంగ్రెస్‌కు ఓటు వేయడం అంటే అవినీతిని బలోపేతం చేయడమేనని విమర్శలు గుప్పించారు. 

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేసులను కాంగ్రెస్ మరియు జెడి(ఎస్) ఏకకాలంలో ఉపసంహరించుకున్నాయని, దాదాపు 1,700 మంది కార్యకర్తలను జైలు నుంచి విడుదల చేశారని నడ్డా ఆరోపించారు. “కర్ణాటకలో మత విద్వేషాలు సృష్టించిన పిఎఫ్‌ఐకి రెండు పార్టీల మద్దతు ఉందనీ, కానీ నేడు అవి దేశవ్యాప్తంగా నిషేధించబడ్డాయని ఆయన సంచలన వ్యాఖ్క్ష్యలు చేశారు. అలాంటి వారిని అధికారంలోకి రానివ్వకూడదని... ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సురక్షితంగా ఉందని, అలాగే మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప, సీఎం బసవరాజ్‌ బొమ్మై నాయకత్వంలో రాష్ట్రం సురక్షితంగా ఉందని అన్నారు.