షాక్: లవర్‌తో మాట్లాడుతున్నాడని యువకుడిపై కత్తితో దాడి

Congress corporator's son stabs woman in Karnataka
Highlights

లవర్‌పై  సన్నిహితంగా ఉన్నాడని దాడి


బెంగుళూరు: కర్ణాటకలో తన ప్రియురాలితో మరో వ్యక్తి సన్నిహితంగా ఉంటున్నాడనే విషయాన్నిగమనించిన ప్రియుడు  అతడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన  ఆ వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌ లింగరాజు​కుమారుడు రాకేశ్‌ గత కొంతకాలం నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ యువతికి ఓ క్లోజ్‌ఫ్రెండ్‌ ఉన్నాడని రాకేశ్‌ తెలుసుకున్నాడు.

తన ప్రియురాలు ఇంకెవరితోనూ మాట్లాడకూడదని భావించాడు. అప్పటినుంచీ ఆ యువకుడిపై తన పగ తీర్చుకోవాలని భావించాడు రాకేశ్‌. ఈ క్రమంలో పథకం ప్రకారం మంగళవారం తన గర్ల్‌ఫ్రెండ్‌ స్నేహితుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. 


రాకేశ్‌ కత్తిదాడిలో  తీవ్రంగా గాయపడ్డ బాధితుడు ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. దీనిపై దేవనగేనేలోని కేటీజే నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

loader