Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 6న రాహుల్ పాదయాత్రలో పాల్గొననున్న సోనియా గాంధీ

రాహుల్ గాంధీ నిర్వహిస్తోన్న భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఈ నెల 6న ఆమె పాదయాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Congress chief Sonia Gandhi To Join rahul gandhi's Bharat Jodo Yatra On Thursday
Author
First Published Oct 2, 2022, 8:49 PM IST

రాహుల్ గాంధీ నిర్వహిస్తోన్న భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఈ నెల 6న ఆమె పాదయాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కర్ణాటకలో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. 

అంతకుముందు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయ‌న‌కు రాహుల్ గాంధీ నివాళి అర్పించారు. భారత్ జోడో యాత్ర లో భాగంగా పాద‌యాత్ర చేప‌డుతూ ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ క‌ర్ణాట‌క‌లో ఉన్నారు. దీంతో బదనవాలులోని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయ‌న పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ‘‘ అన్యాయానికి వ్య‌తిరేకంగా గాంధీ దేశాన్ని ఏకం చేశారు. మేము కూడా అలాగే దేశాన్ని ఏకం చేస్తామ‌ని ప్రతిజ్ఞ చేస్తున్నాము’’ అని ఆయ‌న పేర్కొన్నారు. ‘‘ బాపు మాకు సత్యం, అహింస మార్గంలో నడవాలని నేర్పించారు. ప్రేమ, కరుణ, సామరస్యం, మానవత్వం అర్థాన్ని ఆయన వివరించారు’’ అని కాంగ్రెస్ రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.

జుబాన్‌పేపై భారత్‌ జోడో' నినాదంతో, దృఢ సంకల్పంతో సంఘీభావ జ్యోతితో నేడు బాపు చూపిన బాటలో నడుస్తున్నామని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వ‌ర‌కు సాగుతున్న భారత్ బోడో యాత్ర కు సంబంధించిన సంగ్రహావలోకనంతో పాటు మహాత్మా గాంధీ వీడియో మాంటేజ్‌ను కూడా షేర్ చేశారు. కాగా.. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని మహాత్మాగాంధీ స్మారక చిహ్నం అయిన రాజ్‌ఘాట్ వ‌ద్ద పూలమాల‌లు వేసి నివాళి అర్పించారు.

ALso Read:అన్యాయానికి వ్యతిరేకంగా మహాత్ముడిలాగే మేము కూడా భారత్ ను ఏకం చేస్తాం - రాహుల్ గాంధీ

స్వాతంత్ర సమరయోధుడు, ప్రజా నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రికి కూడా కాంగ్రెస్ నివాళులర్పించింది. మాజీ ప్రధానికి నివాళి అర్పిస్తూ.. ‘‘ లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్, జై కిసాన్’ నినాదం మన జవాన్లు,  దేశానికి అంకితమైన రైతుల రక్తం, చెమట కోసం భారతీయులలో గర్వాన్ని నింపింది" అని పార్టీ పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios