కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అయితే రోటిన్ చెకప్‌లో భాగంగానే ఆమె ఆసుపత్రిలో చేరారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాగా సాయంత్రం 7 గంటలకు సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరగా.. ఆ సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు కూడా తల్లి వెంటే ఉన్నారు. 73 ఏళ్ల సోనియా గాంధీ కొద్ది సంవత్సరాల క్రితం సర్వైకల్ క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్నారు.

2011లో సోనియా గాంధీ అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన వైద్య పరీక్షల కోసం ఆమె ఏడాదికొసారి అమెరికాకు వెళ్తు ఉంటారు. ఈ క్రమంలో సోనియా గాంధీ అస్వస్థతకు గురికావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి.

Read More:

నిర్భయ దోషుల ఉరిపై స్టే ఎత్తివేత పిటిషన్: తీర్పు రిజర్వ్

భార్యను నరికి, తల చేతిలో పట్టుకుని 1.5 కి.మీ. ఇలా నడిచి