లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యంత భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య తల నరికి దాన్ని చేతిలో పెట్టుకుని దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో గల పోలీసు స్టేషన్ కు నడిచి వెళ్లి లొంగిపోయాడు. ఎస్పీ చతుర్వేది ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు 

అఖిలేష్ రావత్ అనే వ్యక్తి జహంగిరాబాద్ పీఎస్ పరిధిలోని బహదూర్ పూర్ గ్రామంలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు.  రెండేళ్ల క్రితం అతనికి అదే ప్రాంతానికి చెందిన రజని అనే యువతితో వివాహం జరిగింది. వారికి ఓ పాప కూడా పుట్టింది. అయితే అనారోగ్యంతో ఆ పాప మరణించింది.

ఆ క్రమంలో భార్యభార్తల మధ్య తరుచుగా గొడవ జరుగుతుండేది. శనివారంనాడు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో అతను తన భార్యను చంపి తలను వేరు చేశాడు. ఆ తర్వాత తలను పట్టుకుని పోలీసు స్టేషన్ కు బయలుదేరాడు.

పోలీసులు దారిలో దాన్ని గమనించి తలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు అయితే, వారితో అతను గొడవ పడ్డాడు. ఆ తర్వాత పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అక్కడ పోలీసులు అతని నుంచి తలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వెంటనే అతను జాతీయ గీతం ఆలపించాడు.