సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ప్రధాని మంత్రి పగ్గాలు చేపట్టాలని కలలు కన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అయితే మోడీ ప్రభంజనంలో హస్తం కొట్టుకుపోయింది. దీంతో రాహుల్ ఆశలు ఆవిరయ్యాయి.

ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ యువనేత రాజీనామాకు సిద్ధపడ్డారు. సోనియా సహా సీనియర్ నేతలు వారిస్తున్నప్పటికీ ఆయన వినడం లేదు. ఫలితాల రోజు సాయంత్రం మీడియాకు కనిపించిన రాహుల్ ఆ తర్వాతి నుంచి మీడియాకు దూరంగా ఉంటున్నారు.

ఎంతగా బాధ మరచిపోదామన్నా వల్ల కావడం లేదు. ఈ క్రమంలో తన ప్రియమైన పెంపుడు కుక్కతో రాహుల్ షికారుకు వెళుతూ ఫోటోగ్రాఫర్లకు చిక్కారు. ఈ ఫోటోలో రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని ఆయన ఇంటి నుంచి పెంపుడు కుక్కతో కారులో వెళ్తున్నాడు. ఈ ఫోటోను సామాజిక మాధ్యమంలో షేర్ చేయగానే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2017లో రాహుల్ తన పెంపుడు కుక్కతో చేసిన అల్లరి అప్పట్లో జనాల్లోకి బాగా వెళ్లింది.