గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ప్రకటించింది. మల్లికార్జున్ ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు, అశోక్ గెహ్లాట్, జిగ్నేశ్ మేవానీ, కన్హయ్య కుమార్‌ సహా 40 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితా ప్రకటించింది. 

న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మంగళవారం స్టార్ క్యాంపెయినర్ల జాబితా ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, గాంధీలు, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, జిగ్నేష్ మేవానీ, కన్హయ్య కుమార్ సహా 40 మంది ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరుగుతున్నాయి. డిసెంబర్ 1వ తేదీన, డిసెంబర్ 5వ తేదీన ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలు 8వ తేదీన వెలువడతాయి.

ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఇందులో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఉన్నారు. వీరితోపాటు చత్తీస్‌గడ్ సీఎం భుపేశ్ భగేల్, సీనియర్ పార్టీ నేతలు సచిన్ పైలట్, జిగ్నేష్ మేవానీ, కన్హయ్య కుమార్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్, హర్యానా మాజీ సీఎం భుపీందర్ సింగ్ హుడా, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్‌లు సహా 40 మంది పేర్ల జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది.

Also Read: గుజరాత్ ఎన్నికలపై అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘కాంగ్రెస్సే మా ప్రత్యర్థి’

182 స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. ఇక్కడ బీజేపీ సుమారు రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నది. అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతున్నది.