Bharat Jodo Yatra: రెండో దశ భారత్ జోడో యాత్రపై కీలక ప్రకటన చేసిన కాంగ్రెస్..
Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ నాయకత్వంలో కొనసాగే భారత్ జోడో యాత్రం రెండో దశకు సంబంధించిన పూర్తి షెడ్యూల్డ్ ను కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించింది.

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టిన భారత్ జోడో యాత్ర నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. గతేడాది సెప్టెంబర్ 7 న రాహుల్ గాంధీ అధ్యక్షతన కన్యాకుమారి ప్రారంభమైన భారత యాత్ర కాశ్మీర్ వరకు సాగింది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ 4000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ లక్షలాదిమంది ప్రజలతో మమేకమయ్యారు.అయితే.. కాంగ్రెస్ ఆశించిన దాని కంటే ఈ యాత్ర మంచి ఫలితాలు రావడంతో రెండో దశ భారత్ జోడోయాత్ర ప్రారంభించాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
తాజాగా భారత్ జోడో యాత్ర తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర 2పై కీలక అప్డేట్ ఇచ్చింది. త్వరలోనే రెండో దశ యాత్రకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా అధికారిక ఖాతాల్లో పోస్ట్ చేసింది. రెండో దశ యాత్రకు సంబంధించిన పూర్తి షెడ్యూల్డ్ ను త్వరలోనే వెల్లడించాలని పార్టీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 2022 సెప్టెంబర్ 7 ప్రారంభమై.. ఈ ఏడాది జనవరి 30 వరకు సాగింది. ఈ యాత్ర మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,801 కిలోమీటర్లు యాత్ర కొనసాగుతుందని పేర్కొంది. 145 రోజుల పాటు కొనసాగిన ఈ తొలి దశ యాత్రలో మొత్తం 75 జిల్లాల్లో 100 కార్నర్ మీటింగ్స్, 275 చోట్ల వాకింగ్ ఇంటరాక్షన్, 12 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు ఓ ఫోటోను పోస్టు చేసింది.
ఈ మేరకు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మాట్లాడుతూ.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తొలి దశకు విశేష స్పందన లభించిన తర్వాత ఇప్పుడు గుజరాత్ నుంచి మేఘాలయ వరకు రెండో దశకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. అదే సమయంలో మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తారని ఆయన తెలిపారు. మహారాష్ట్రలో యాత్రకు సన్నాహకంగా రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ స్థానానికి 48 మంది పార్టీ పరిశీలకులను నియమించినట్లు పటోలే తెలిపారు. ఈ పరిశీలకులు ఆరు రోజుల్లోగా క్షేత్రస్థాయి పరిస్థితిపై నివేదికను సమర్పించారనీ, ఆ తర్వాత ఆగస్టు 16న కోర్ కమిటీ సమావేశం జరగనుందని తెలిపారు.
పటోలే ప్రకారం.. , తూర్పు విదర్భలో యాత్రకు పటోలే నాయకత్వం వహిస్తారని, ముంబైలో వర్ష గైక్వాడ్, పశ్చిమ విదర్భలో విజయ్ వాడెట్టివార్, ఉత్తర మహారాష్ట్రలో బాలాసాహెబ్ థోరట్, మరఠ్వాడాలో అశోక్ చవాన్, పశ్చిమ మహారాష్ట్రలో పృథ్వీరాజ్ చవాన్ నాయకత్వం వహిస్తారు. అనంతరం నేతలంతా కలిసి కొంకణ్‌కు వెళ్లనున్నారు.
రాహుల్ గాంధీ తన రెండో దశ యాత్రను రాష్ట్రం నుంచి ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించినట్లు గుజరాత్ కాంగ్రెస్ ప్రకటించిన రోజు తర్వాత ఈ ప్రకటన వెలువడింది. మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్‌ల జన్మభూమి అయిన గుజరాత్ నుంచి భారత్ జోడో యాత్ర రెండో దశను ప్రారంభించాలని రాహుల్ గాంధీకి ఆహ్వానం పంపామని, రెండో దశ జోడో యాత్ర గుజరాత్ నుంచే ప్రారంభం కావాలని గుజరాత్ ప్రతిపక్ష నేత అమిత్ చావ్డా పేర్కొన్నారు. రెండవ దశ యాత్రలో తూర్పు నుండి పశ్చిమం వరకు ఉన్న రాష్ట్రాలను కవర్ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.