విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మరాఠాలు చేపట్టిన ఆందోళన మరోసారి  హింసాత్మకంగా మారింది.రూరల్ పూణెలో  ఆందోళనకారులు  పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. 


ముంబై: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మరాఠాలు చేపట్టిన ఆందోళన మరోసారి హింసాత్మకంగా మారింది.రూరల్ పూణెలో ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. సుమారు 40కిపైగా బస్సులకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మరో 50 బస్సులను ధ్వంసం చేశారు.

విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేస్తూ మరాఠాలు ఆందోళన నిర్వహిస్తున్నారు. రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొంతకాలంగా మహారాష్ట్రలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ కూడ నిరసనకారులు ఆందోళన నిర్వహించారు.

రూరల్ పూణెలో రోడ్లపై ఆందోళనకారులు తమ ప్రతాపం చూపారు. 40కు పైగా బస్సులకు నిప్పుపెట్టారు. మరో 50 వాహనాలను ధ్వంసం చేశారు. వాహనదారులు ఎక్కడికక్కడే తమ వాహనాలను వదిలేసి ప్రభుత్వ కార్యాలయాల్లో తలదాచుకొన్నారు. 

ఆందోళనకారుల నిరసనలతో రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయివును ప్రయోగించారు. ఇదిలా ఉంటే రిజర్వేషన్ల అంశాన్ని చర్చించేందుకు గాను ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని శివసేన, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేశాయి.