దేశాన్ని విభజించే కుట్రలను సహించలేం: రాజ్యసభలో కాంగ్రెస్‌పై మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  కాంగ్రెస్ తీరుపై  విమర్శలు గుప్పించారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన  విధానాలపై ఆయన మండిపడ్డారు. 

Cong ceased large chunks of countrys land to enemy, PM Modi alleges lns

న్యూఢిల్లీ:  కాంగ్రెస్ పార్టీపై  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  రాజ్యసభలో బుధవారం నాడు  విమర్శలు గుప్పించారు.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు  రాజ్యసభలో  బుధవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  సమాధానం చెప్పారు.రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఇటీవల కాలంలో  ఖర్గే  ఎన్‌డీఏపై విమర్శలు చేశారు. 400 సీట్లతో ఎన్‌డీయే అధికారంలోకి వస్తుందని ఖర్గే  వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యలపై  మోడీ ఇవాళ స్పందించారు.

రాష్ట్రపతి ప్రసంగంపై కొందరు అభిప్రాయాలు చెప్పారు, మరికొందరు విమర్శించారన్నారు.గతంలో తన ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకున్నాయన్నారు. విపక్షాలు తన మాటలు వినేందుకు సిద్దంగా లేరని అర్ధమౌతుందన్నారు. విపక్షాల దుస్థితికి కాంగ్రెస్ పార్టీ జవాబుదారీ  అని ఆయన  చెప్పారు. పార్లమెంట్ లో ఉన్నంతకాలం ఏదైనా  మంచి చేయడానికి ప్రయత్నించాలన్నారు.ఉత్తరం, దక్షిణం పేరుతో విడదీయాలని చూడడం సరికాదని  మోడీ కోరారు.కాంగ్రెస్‌వన్నీ పనికిరాని ఆలోచనలుగా ఆయన పేర్కొన్నారు.

also read:రిజర్వేషన్లకు నెహ్రు వ్యతిరేకం: రాజ్యసభలో మోడీ

కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మోడీ  విమర్శించారు. భారతీయ సంస్కృతిని అసహ్యించుకున్నది కాంగ్రెస్ పార్టీ అని ఆయన ఆరోపించారు.యుద్ధవీరులను కాంగ్రెస్ కనీసం గౌరవించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని స్థాపించిందే ఓ బ్రిటిషర్ అని  మోడీ విమర్శించారు. ఆలోచనల్లోనూ కాంగ్రెస్ అవుడేటేడ్ అయిందన్నారు.చూస్తుండగానే కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయిందని ఆయన ఆరోపించారు. లోక్ సభలో  ఖర్గేను మిస్సైనట్టుగా  మోడీ చెప్పారు. కాంగ్రెస్ కు  40 సీట్లు కూడ రావని  ఆయన  మమత బెనర్జీ చెప్పారని ఆయన గుర్తు చేశారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన పార్టీ ఇంతగా దిగజారిపోవడం తమకు సంతోషాన్ని ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ తీరుపట్ల సానుభూతి తెలుపుతున్నట్టుగా మోడీ వ్యాఖ్యానించారు.

వ్యవస్థలను కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందన్నారు.జీఎస్టీ లాంటి చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా మోడీ గుర్తు చేశారు. దేశ సైనికుల కోసం ఒక్క మెమోరియల్ కాంగ్రెస్   ఏర్పాటు చేయలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ విదేశీ వస్తువులను ప్రోత్సహిస్తే తాము మేకిన్ ఇండియాను ప్రోత్సహిస్తున్నామన్నారు.సామాజిక న్యాయంపై  కాంగ్రెస్ తమకు  తమకు పాఠాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.యూపీఏ పాలనలో దేశ ఆర్ధిక వ్యవస్థ సర్వనాశనం అయిందని ఆయన  చెప్పారు. బానిసత్వపు గుర్తులను చెరిపివేస్తున్నామన్నారు.

నిధులు రావడం లేదని ఓ రాష్ట్ర ప్రభుత్వం  ఢిల్లీలో  ధర్నా నిర్వహించిన విషయాన్ని తనకు బాధ కల్గించిదన్నారు. దేశమంటే మన దేహం లాంటిందన్నారు.దక్షిణ భారత దేశం కావాలని ధర్నా చేస్తారా  అని ఆయన ప్రశ్నించారు.తనకు రాష్ట్రాలపై  వివక్ష లేదన్నారు. నది మా రాష్ట్రంలోనే ఉంది, మేమే నీటిని వాడుకుంటామంంటే కుదురుతుందా అని ఆయన ప్రశ్నించారు. తమ రాష్ట్రం మా టాక్స్  అంటారు ఇదెక్కడి వితండవాదని మోడీ ప్రశ్నించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios