Asianet News TeluguAsianet News Telugu

ఏంటీ ... కండోమ్ సమోసాలా...! : ఆ క్యాంటిన్ లో మాత్రమే...

ఉల్లి సమోసా, కార్న్ సమోసా చూసివుంటారు... కానీ కండోమ్ సమోసా, గుట్కా సమోసాను ఎప్పుడైనా చూసారా? పూణేలోని ఓ ఆటోమొబైల్ కంపనీ ఉద్యోగులు అలాంటి సమోసాలను రుచిచూాాసారు. అసలేం జరిగిందంటే... 

condoms found in samosas at Pune Maharashtra AKP
Author
First Published Apr 10, 2024, 3:20 PM IST

పూణే : వేడివేడి సమోసాలను నూనెలో వేయించిన మిర్చీలు లేదంటే ఉల్లిపాయ ముక్కలతో కలిపి కొరుక్కుని తింటుంటే ఆ మజాయే వేరు. చలి, వర్షాకాలాల్లో అయితే చల్లటి వాతావరణంలో వేడివేడి సమోసాలు లేదంటే బజ్జీలు తినాలని చాలామంది కోరుకుంటారు. ఇలా ఆలూ, ఆనియన్, కార్న్, ఎగ్... చివరకు చికెన్  సమోసా కూడా మీరు చూసుంటారు. కానీ కండోమ్ సమోసాను ఎక్కడైనా చూసారా? కనీసం అలాంటి సమోసాలు వుంటాయని కూడి వినివుండరు. అలాంటి సమోసాలను పూణేలోని ఓ కంపనీ సిబ్బంది రుచిచూడాల్సి వచ్చింది. 

అసలు విషయం ఏంటంటే... మహారాష్ట్రలోని ప్రముఖ నగరం పూణేకు చెందిన ఓ కంపనీలో చాలామంది వర్కర్లు పనిచేస్తున్నారు. కార్మికుల సౌకర్యార్థం ఆ కంపనీ యాజమాన్యం ఓ వ్యక్తికి క్యాంటిన్ పెట్టుకునే అవకాశం ఇచ్చింది. కార్మికులతో పాటు ఉద్యోగులు ఇక్కడే చాయ్, కాఫీతో పాటు అల్పాహారం చేసేవారు. అలాగే సమోసాలతో పాటు మరికొన్ని రకాల స్నాక్స్ కూడా ఈ క్యాంటిన్ లో దొరికేవి. 

అయితే క్యాంటిన్ నిర్వహణ లాభదాయకంగా వుండటంతో చాలాకాలంగా దీనిపైనే మంచి ఆదాయం పొందుతున్నాడు యజమాని. కానీ ఇటీవల సదరు కంపనీ క్యాంటిన్ కాంట్రాక్ట్ ను క్యాన్సిల్ చేసి అతడిని వెంటనే తొలగించాల్సిందిగా ఆదేశించింది. ఎంత ప్రయత్నించినా క్యాంటిన్ నిర్వహణకు కంపనీ అధికారులు అనుమతించలేదు. దీంతో ఆ కంపనీ సిబ్బందిపై కోపం పెంచుకున్నాడు క్యాంటిన్ కాంట్రాక్టర్. వెళుతూ వెళుతూ కంపనీ సిబ్బందితో నీచమైన ఫుడ్ ను రుచిచూపించాడు. 

ఏంటిది తల్లీ... ఇంత బరితెగించి బట్టలు మార్చుకున్నావ్..!: డిల్లీ వైరల్ వీడియో

క్యాంటిన్ లో దొరికే సమోసాలను కంపనీ సిబ్బంది ఇష్టంగా తినేవారు. దీంతో కండోమ్ లతో పాటు గుట్కా, రాళ్లను ఆ సమోసాల్లో వాడాడు కోపంతో ఊగిపోతున్న క్యాంటిన్ యజమాని. తాము తినడానికి తీసుకున్న సమోసాల్లో ఏవేవో రావడంతో కంపనీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసారు ఉద్యోగులు. దీంతో క్యాంటిన్ ఓనర్ కోపంతో ఈ పని చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సమోసాల్లో కండోమ్, గుట్కా కలిపి ఉద్యోగుల ఆరోగ్యంతో చెలగాటం ఆడిన క్యాంటిన ఓనర్ తో పాటు మరో నలుగురు పనివారిని పోలీసులు అరెస్ట్ చేసారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios