Asianet News TeluguAsianet News Telugu

ఏంటిది తల్లీ... ఇంత బరితెగించి బట్టలు మార్చుకున్నావ్..!: డిల్లీ వైరల్ వీడియో

మహిళా సాధికారతపై చర్చ జరుగుతున్న ఈ సమయంలో ఓ  యువతి అత్యంత దాారుణంగా ప్రవర్తించింది.  మహిళా స్వేచ్చపై ప్రశ్నలు లేవనెత్తెలా ఆమె వ్యవహరించింది. ఆమె నీచపు పని సోషల్ మీడియోలో వైరల్ గా మారింది. 

Woman strips and tries clothes in front of male shop keeper in Delhi AKP
Author
First Published Apr 10, 2024, 12:05 PM IST

డిల్లీ : నేటి ఆధునిక సమాజంలో స్వేచ్చ పేరిట విచ్చలవిడితనం పెరిగిపోయింది. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా బరితెగించి తమ పరువు తామే తీసుకుంటున్నారు. మోడ్రన్ లైఫ్ పేరుతో తమ బ్రతుకును రోడ్డుమీదకు తెచ్చుకుంటున్న అమ్మాయిల సంఖ్య నేడు పెరిగిపోయారు. ఇలా దేశ రాజధాని న్యూడిల్లీలో ఓ యువతి చాలా దారుణంగా ప్రవర్తించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. 

 న్యూడిల్లీ పాలికా బజార్ లోని ఓ బట్టల షాప్ లో సమాజం తలదించుకునే సంఘటన వెలుగుచూసింది. ఓ యువతి బహిరంగంగానే బట్టలు మార్చుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. షాపింగ్ చేయడానికి వచ్చిన మహిళ కనీసం ట్రయల్ రూమ్ ను కూడా వాడుకోకుండా బట్టలు మార్చుకుంది. షాప్ లో పనిచేసే వ్యక్తి ముందే తన షార్ట్ ను విడిచి మరో షార్ట్ ను వేసుకుంది.

ఇలా యువతి బహిరంగంగానే డ్రెస్ మార్చుకుంటుండగా ఎవరో వీడియో తీసారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో  యువతిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం సిగ్గులేకుండా ఇంత ఓపెన్ గా బట్టలు మార్చుకోవడం ఏమిటి? నువ్వసలు ఆడపిల్లవేనా? అంటూ మండిపడుతున్నారు. హద్దులు దాటిన ఆమె ప్రవర్తన మహిళాలోకం సిగ్గుతో తలదించుకునేలా వుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

డిల్లీ యువతి అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ప్రవర్తన మహిళా స్వేచ్చపై అనుమానాలు రేకెత్తిస్తోందని... ఇంత విచ్చలవిడితనం మంచిది కాదని అంటున్నారు. మహిళలకు అతిగా స్వేచ్చ ఇవ్వకూడదని అందుకే అంటారు... వారు బాడీ షో చేసినా తప్పుకాదు... కానీ వారిని కన్నెత్తి చూస్తే చాలు మగాళ్ళను సమాజం నుండి వెలివేసినంత పని చేస్తారంటూ ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ముందు మహిళలు విచ్చలవిడి ప్రవర్తన మానుకోవాలి... అప్పుడే వారిపై మగాళ్ళ అఘాయిత్యాలు, అరాచకాలు తగ్గుతాయని మరికొందరు అంటున్నారు. మొత్తంగా డిల్లీ యువతి చేసిన పని యావత్ మహిళా లోకాన్ని ప్రశ్నించేలా చేస్తోంది. 

సోషల్ మీడియా ఎంట్రీతో యువత ప్రవర్తన మరీ దిగజారిపోయింది. ఆడ, మగ అని తేడాలేదు... తాము పాపులర్ అయ్యేందుకు ఎంతకైనా దిగజారుతున్నారు. తమ బిడ్డలు పెడదారి పట్టేందుకు ఈ సోషల్ మీడియా ప్రధాన కారణం అవుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరీముఖ్యంగా సోషల్ మీడియా రాకతో మహిళలకు భద్రత మరింత కరువయ్యింది... ఎక్కడ ఏం చేస్తే ఏ వీడియో బయటకు వస్తుందోనని భయటపడుతున్నారు. అలాంటిది ఇలా ఓపెన్ గా బట్టలు మార్చుకుంటుంటే వీడియో బయటకు రాదా?  చేయాల్సిన తప్పు చేసి తర్వాత బాధపడటం ఎందుకు... ముందే ఒళ్లు దగ్గరపెట్టుకుని నడుకుంటే బావుంటుంది కదా అంటూ డిల్లీ యువతిని మందలిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios