ఈ కేసుకు సంబంధించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల్లో ఒకరిపై కూడా అభియోగాలు మోపబడ్డాయి. వారిని సస్పెన్షన్‌లో ఉంచినట్లు పోలీసులు తెలిపారు.

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్‌ గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని అక్కడి 12 మంది విద్యార్థినులను వేధించినందుకు సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసుకు సంబంధించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల్లో ఒకరిపై కూడా అభియోగాలు మోపబడ్డాయని, వారిని సస్పెన్షన్‌లో ఉంచినట్లు పోలీసులు తెలిపారు.

"తిల్హార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక జూనియర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 12 మంది బాలికలను కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ మహ్మద్ అలీ వేధింపులకు గురిచేశారు, వీరిలో కొంతమంది దళితులు కూడా ఉన్నారు" సర్కిల్ ఆఫీసర్ (తిల్హార్) ప్రియాంక్ జైన్ తెలిపారు.

కర్ణాటక సీఎం పీఠంపై ఉత్కంఠ.. ఢిల్లీకి వెళ్లిన సిద్దరామయ్య..

విద్యార్థులు ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. కానీ అతను అలీపై ఎటువంటి చర్య తీసుకోలేదని జైన్ తెలిపారు. గ్రామ పెద్ద లలితా ప్రసాద్ ఫిర్యాదు మేరకు ఆ తరువాత కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్ ప్రకారం, శనివారం ఓ దళిత విద్యార్థినిని అలీ వేధించాడు. ఆ విద్యార్థులు వారి కుటుంబాలకు సమాచారం అందించారు.. వారు గ్రామ పెద్దలకు తెలపడంతో ఫిర్యాదు చేశారు. 

కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకుని వీరంగం సృష్టించారు. బాలికలు, పాఠశాలలోని కొంతమంది ఉపాధ్యాయుల స్టేట్‌మెంట్‌లను అక్కడికక్కడే రికార్డ్ చేసినట్లు జైన్ తెలిపారు. విద్యార్థులను వైద్య పరీక్షల నిమిత్తం పంపినట్లు తెలిపారు.

నిందితుడిపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, పోక్సో (లైంగిక నేరాల నుండి బాలల రక్షణ) చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ప్రాథమిక శిక్షా అధికారి కుమార్ గౌరవ్ మాట్లాడుతూ ప్రాథమికంగా కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ దోషిగా తేలాడని, అతని సేవలను రద్దు చేస్తామని తెలిపారు.

స్కూల్ ప్రిన్సిపాల్ అనిల్ కుమార్, అసిస్టెంట్ టీచర్ సజియాలను కూడా వెంటనే సస్పెండ్ చేసినట్లు గౌరవ్ తెలిపారు. పాఠశాలల్లో ప్రస్తుతం ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారని, బోధనకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు ఎక్కువ మంది ట్యూటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. టిల్హార్‌లోని బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు 15 రోజుల్లో నివేదికను సమర్పించనున్నారు.