జాతీయ గీతాన్ని అవమానించారని మమతా బెనర్జీపై మహారాష్ట్రలో 25వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు నమోదైంది. ముంబయి బీజేపీ సెక్రెటరీ దేవానంద్ గుప్తా ఫిర్యాదు చేశారు. ఈ నెలలో ఆమె మహారాష్ట్రలో రెండు రోజుల పర్యటన చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే ఆమె జావేద్ అక్తర్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో హాజరై చివరిలో జాతీయ గీతాన్ని అర్ధంతరంగా ఆపేశారని ఫిర్యాదు నమోదైంది. డిసెంబర్ 17న వాదనలు జరగనున్నాయి.
ముంబయి: పశ్చిమ బెంగాల్(West Bengal) సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee) తమ పార్టీని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ త్రిపుర, గోవాల పార్టీ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆమె ఇటీవలే Maharashtra లో రెండు రోజులు పర్యటించారు. అదే సమయంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అనారోగ్యంతో హాస్పిటల్‌లో ఉన్నారు. దీంతో ఆమె ఆదిత్యా ఠాక్రే, సంజయ్ రౌత్‌లను కలిశారు. అదే పర్యటనలో పలు కార్యక్రమాల్లో హాజరయ్యారు. అలాంటి ఓ కార్యక్రమంలోనే ఆమె జాతీయ గీతాన్ని ఆలపించారు. అయితే, జాతీయ గీతాన్ని (National Anthem) ఆమె కూర్చునే ఆలపించడం ప్రారంభించి ఆ తర్వాత లేచి నిలబడ్డారు. లేచి నిలుచుని కూడా ఆ గీతాన్ని పూర్తిగా పాడకుండా మధ్యలోనే నిలిపేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని అర్ధంతరంగా ముగిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, నెటిజన్లు ఆగ్రహించడాలు జరిగిపోయాయి. తాజాగా, మహారాష్ట్రలోని ఓ బీజేపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, అక్కడ నుంచి సరైన స్పందన రాలేదని ఏకంగా కోర్టును ఆశ్రయించారు. ఓ ఫిర్యాదును నమోదు చేశారు.
Also Read: మమతకు షాకిచ్చిన సోనియా.. విపక్ష నేతల సమావేశానికి తృణమూల్‌కు దక్కని ఆహ్వానం
ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971లోని సెక్షన్ 3 కింద ఆయన ఫిర్యాదు నమోదు చేశారు. బీజేపీ ముంబయి సెక్రెటరీ వివేకానంద్ గుప్తా ముంబయిలోని 25వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. సీపీసీలోని సెక్షన్ 156(3) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ముంబయిలోని కఫ్ పరేడ్ పోలీసు స్టేషన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని ఆ ఫిర్యాదులో కోర్టును కోరారు. ముంబయిలోని కఫ్ పరేడ్‌లో వైబీ చవాన్ ప్రతిష్టాన్‌లో డిసెంబర్ 1వ తేదీన నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె జాతీయ గీతాన్ని అవమాన పరిచినట్టు పేర్కొన్నారు. రచయిత జావేద్ అక్తర్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరై జాతీయ గీతాన్ని ఆలపించారని తెలిపారు. ఆ కార్యక్రమం చివరిలో ఆమె కూర్చునే జాతీయ గీతాన్ని ఆలపించారని, ఆ తర్వాత లేచి నిలబడి రెండు పాదాలు పాడి అర్ధంతరంగా జాతీయ గీతాన్ని ముగించిందని ఆరోపించారు. అనంతరం వెంటనే ఆమె ఆ కార్యక్రమ వేదిక నుంచి వెళ్లిపోయారని వివరించారు.
Also Read: థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు.. చేరనున్న టీఆర్ఎస్ ?
ఈ విషయమై తాను ముంబయి పోలీసు కమిషనర్‌కు, స్థానిక పోలీసు స్టేషన్‌కూ ఫిర్యాదు చేశారని బీజేపీ నేత గుప్తా పేర్కొన్నారు. కానీ, ఆ తర్వాత తనకు ఆ ఫిర్యాదు గురించిన సమాచారం ఏదీ అందలేదని వివరించారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా తనకు తెలియదని చెప్పారు. తనకు మరో మార్గం లేక కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. డిసెంబర్ 17వ తేదీన గుప్తా తన కేసులో కోర్టుకు వాదనలు వినిపించబోతున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీకి, బీజేపీకి గట్టి పోటీ జరిగింది. ఇందులో టీఎంసీ విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
