బీహార్ : నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం .. కమీషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ విచారణ
బీహార్‌లోని బక్సార్ జిల్లాలో బుధవారం రాత్రి నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాదంలో నలుగురు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోగా.. 30 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై కమీషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ విచారణను చేపట్టనున్నారు.
బీహార్‌లోని బక్సార్ జిల్లాలో బుధవారం రాత్రి నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాదంలో నలుగురు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోగా.. 30 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై కమీషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ విచారణను చేపట్టనున్నారు. ఈ మేరకు ఈస్ట్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో వీరేంద్ర కుమార్ తెలిపారు. ఈ ఘటనపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి అసోంలోని కామాఖ్యకు వెళ్తున్న నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ (12506) దానాపూర్ డివిజన్‌లోని రఘునాథ్‌పూర్ స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి 9.53 గంటలకు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నాలుగు పట్టాలు తప్పినట్లుగా రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
ఈ దురదృష్టకర ఘటనలో నలుగురు ప్రయాణీకులు మరణించగా.. నలుగురు ప్రయాణీకులు మరణించగా, 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రైల్వే శాఖ రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. రైల్వే సీనియర్ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికులను ఘటనాస్థలి నుంచి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి రఘునాథ్‌ఫూర్ నుంచి ప్రత్యేక రైలును నొక్కారు. గురువారం ఉదయం రైలు బరౌని స్టేషన్‌కు చేరుకోగానే ప్రయాణీకులకు ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించారు.
ప్రమాద విషయం తెలుసుకున్న రైల్వే, పోలీస్ , అగ్నిమాపక శాఖ అధికారులు , ఎన్డీఆర్ఎఫ్‌లు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని రఘునాథ్‌పూర్ , అర్రా, బక్సార్, పాట్నా ఆసుపత్రులకు తరలించారు. బాధితుల సహాయార్ధం రైల్వే శాఖ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది.