అర్ధరాత్రుల దాకా రోడ్డు మీద తిరిగి ఇంటికి వస్తున్న కొడుకు ఇంకా చెడిపోతాడనే భయంతో మంచి మాటలు  చెప్పిన కన్నతల్లిని ఓ యువకుడు దారుణంగా హతమార్చాడు.

వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రం మాండ్యాలోని ఓ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్ధి తన స్నేహితులతో తరచూ రాత్రివేళ బయట తిరుగుతూ ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడు. దీంతో అతని తల్లి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

Also Read:చనిపోయిన పెద్ద కొడుకును పదే పదే తలచుకుంటోందని: తల్లిని చంపిన చిన్న కొడుకు

రాత్రివేళ ఇంటికి త్వరగా రావాలని ఆమె తన కుమారుడికి పలుమార్లు చెప్పి చూశారు. అయితే ఆమె మాటను ఆ యువకుడు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ క్రమంలో బుధవారం నాడు కూడా ఆలస్యంగా ఇంటికి వెళ్లాడు.

దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె ఎందుకు త్వరగా ఇంటికి రావడం లేదని తల్లి నిలదీశారు. ఇకపై ఆలస్యంగా వస్తే ఊరుకునేది లేదని తిట్టారు. ఈ నేపథ్యంలో కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు తల్లిని కత్తితో పొడిచి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.