ముంబై: డాక్టర్ పాయల్ తాడ్వీ ఆత్మహత్య కేసు కీలక మలుపు చోటు చేసుకొంది. సీనియర్ల వేధింపులు తాళలేక  ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని కాలేజీ యాజమాన్యం నిర్ధారించింది.పాయల్ కుటంబసభ్యులు,  తోటి విద్యార్థులు, సిబ్బంది సహ 30 మందికి పైగా వ్యక్తులను విచారించిన తర్వాత కమిటీ అభిప్రాయపడింది.

కాలేజీలో చోటు చేసుకొన్న వేధింపులపై తొమ్మిది రోజుల క్రితం కాలేజీ యాజమాన్యానికి పాయల్ భర్త  ఫిర్యాదు చేశారు. దీంతో పాయల్‌పై మరింత వేధింపులకు పాల్పడ్డారని బాధిత కుటుంబం ఆరోపించింది. 

ఈ నెల 13వ తేదీన పాయల్  కాలేజీ యాజమాన్యానికి వేధింపుల గురించి ఫిర్యాదు చేసింది. అయితే మూడు రోజుల పాటు సీనియర్లు నిశ్శబ్దంగానే ఉన్నారు. ఆ తర్వాత బాధితురాలిని అవమానాలకు గురి చేశారు. ఫైళ్లు విసిరి కొట్టారు. పనిచేయడం రాదని అందరి ముందు తిట్టేవారు. మూడో ఏడాది కోర్సు పూర్తి చేయకుండా అడ్డుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారు.

కులం పేరుతో దూషించడంతో బీవైఎస్ నాయర్ ఆసుపత్రిలో వైద్య విద్యలో పీజీ చదువుతున్న డాక్టర్ పాయల్ తాడ్వి ఈ నెల 22వ తేదీన ఆత్మహత్య చేసుకొంది. ఈ కేసులో ముగ్గురు మహిళ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.