Asianet News TeluguAsianet News Telugu

బోరుబావిలో చిన్నారి సుజిత్.. వెలికితీతకు రూ.5లక్షల ఖర్చు

తిరుచ్చి జిల్లా నడుకాట్టుపట్టికి చెందిన సుజిత్ శుక్రవారం తన ఇంటి సమీపంలో ఆడుకుంటూ సుమారు 600 అడుగుల లోతైన బోరు బావిలో పడిన సంగతి తెలిసిందే..

collector Shivarasu meets Sujith's family, says his death is unfortunate
Author
Hyderabad, First Published Oct 31, 2019, 10:33 AM IST

తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని నడుకాట్టుపట్టి గ్రామంలో బోరుబావిలో పడి రెండేళ్ల బాలుడు సుజిత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా... బోరుబావిలో పడిన చిన్నారిని బయటకు వెలికి తీసేందుకు రూ.5లక్షలు ఖర్చు చేసినట్లు ఆ జిల్లా కలెక్టర్ శివరాసు తెలిపారు. 

బాలుడు బోరుబావిలో పడినప్పటి నుంచి వెలికితీతకు రూ.5కోట్లు ఖర్చు చేశారంటూ టీవీల్లో వార్తలు వచ్చాయి. కాగా... ఆ వార్తలను కలెక్టర్ ఖండించారు. బోరుబావి పక్కనే గోతిని తవ్వేందుకు రిగ్గు యంత్రాలు ఉపయోగించిన ఓఎన్‌జీసీ, ఎల్‌అండ్‌ టీ, ఎన్‌ఎల్‌సీ సంస్థలు ఎలాంటి ఖర్చులు కోరకుండా మానవతాదృక్పథంతో సేవలందించాయని చెప్పారు. వాస్తవాలు ఇలా వుండగా తప్పుడు వార్తలు ప్రచురించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

తిరుచ్చి జిల్లా నడుకాట్టుపట్టికి చెందిన సుజిత్ శుక్రవారం తన ఇంటి సమీపంలో ఆడుకుంటూ సుమారు 600 అడుగుల లోతైన బోరు బావిలో పడిన సంగతి తెలిసిందే.. 

AlsoRead కళ్లముందు మనిషి తగలపడిపోతుంటే...

బోరు బావిలో పడిన రెండేళ్ల చిన్నారి సుజిత్ ను వెలికి తీసేందుకు గాను తిరుచ్ఛిపల్లి, కోయంబత్తూరు, మధురై నుండి నిపుణుల బృందం వచ్చింది.పసిబాలుడి నడుము చుట్టూ తాడును బిగించి  బోరు బావి నుండి వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేశారు. మూడు దఫాలు ఈ రకంగా చేసిన ప్రయత్నాలు విపలమయ్యాయి. 

సుజిత్ ను బోరు బావి నుండి వెలికితీసేందుకు గాను బోరు బావి పక్కనే సమాంతరంగా మరో సొరంగం తవ్వుతున్న సమయంలో సుజిత్ విల్సన్  బోరు బావిలో మరింత కిందకు జారిపోయినట్టుగా  తమిళనాడు రాష్ట్ర మంత్రి విజయభాస్కర్ ప్రకటించారు.

తొలుత 27 అడుగుల లోతులో ఉన్న సుజిత్ విల్సన్ ఆ తర్వాత 70 అడుగుల  లోతులోకి కూరుకుపోయినట్టుగా మంత్రి  విజయభాస్కర్ చెప్పారు.బోరు బావిలో పడిన సుజిత్ విల్సన్ ను బయటకు తీసేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ పోర్స్, ఎన్‌ఎల్‌సీ సిబ్బంది బోరు బావిలో పడిన బాలుడిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి విజయభాస్కర్ ప్రకటించారు.

బోరు బావిలో పడిపోయిన బాలుడిని సజీవంగా ఉంచేందుకు ఆక్సిజన్ ను నిరంతరరాయంగా సరఫరా చేస్తున్నామని మంత్రి ప్రకటించారు.శనివారం నాడు ఉదయం నుండి ఆ బాలుడి శబ్దాలు తాము వినలేదని రెస్క్యూ సిబ్బంది ప్రకటించారు. బాలుడిని రక్షించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టుగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. కాగా.. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చిన్నారి మాత్రం ప్రాణాలతో లభించలేదు.  కాగా... ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

వేంగైకురిచ్చి గ్రామ నిర్వాహక అధికారి హుస్సేన్‌ బీబి మరప్పారై పోలీస్‌స్టేషన్‌లో అందజేసిన ఫిర్యాదు ఆధారంగా 174వ సెక్షన్‌ కింద నమోదైన కేసుపై జిల్లా ఎస్పీ ముత్తుకుమార్‌ నేతృత్వంలోని కమిటీ బుధవారం దర్యాప్తు ప్రారంభించింది.

AlsoRead తమిళనాడు బోరు బావి ప్రమాదం: సుజిత్ కథ విషాదాంతం...

 ఫిర్యాదు అందజేసిన సందర్భంగా వీఏఓ హుస్సేన్‌ బీబి మాట్లాడుతూ, నడుకాట్టుపట్టికి చెందిన ఆరోగ్యరాజ్‌కు సొంతమైన వ్యవసాయ భూమిలో ఏడేళ్ల క్రితం తవ్వకాలు జరిపిన బోరుబావిలో నీరు రానందువల్ల దానిని మూసివేయలేదని, ఇందువల్ల ఆ బోరుబావి గుంతలో జారిపడిన ఆరోగ్యరాజ్‌ కుమారుడు సుజిత్‌ మరణించారని, దీనిపై విచారణ జరిపి తగు చర్యలు చేపట్టవలసిందిగా తన ఫిర్యాదులో కోరినట్టు తెలిపారు. 

ఇదిలా ఉండగా, తిరుచ్చి జిల్లా ఎస్పీ ముత్తుకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ, వీఏఓ అందజేసిన ఫిర్యాదు ఆధారంగా 174 (అనుమానిత మరణం) సెక్షన్‌ కింద పోలీసులు నమోదుచేసిన కేసుపై దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. కాగా.. సుజిత్ కుటుంబానికి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు రూ.10లక్షల ఆర్థిక సహాయం అందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios