Asianet News TeluguAsianet News Telugu

రాజ్‌ధాని ఎక్స్‌ప్రెస్‌‌లో ఎగ్ ఆమ్లెట్‌లో బొద్దింక.. ఇండియన్ రైల్వేకు ఇది సిగ్గు చేటు అంటూ నెటిజన్ల మండిపాటు

రాజ్‌ధాని ఎక్స్‌ప్రెస్‌లో ఎగ్ ఆమ్లెట్‌లో బొద్దింక వచ్చింది. దాన్ని ఓ ప్రయాణికుడు ట్వీట్ చేసి ఇది తన బిడ్డ తిన్నాక ఏమైనా జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు అంటూ ప్రధాని మోడీ, రైల్వే శాఖ మంత్రి పియుశ్ గోయల్, రైల్వే శాఖలను ట్యాగ్ చేశారు. ఆయన ట్వీట్‌కు చాలా మంది నుంచి మద్దతు లభించింది.
 

cockroach in egg omelette in rajdhani express, passenger tweet uproars
Author
First Published Dec 17, 2022, 6:37 PM IST

న్యూఢిల్లీ: ఓ సోషల్ మీడియా పోస్టుతో భారత రైల్వే తీవ్ర విమర్శలపాలైంది. ఓ ప్రయాణికుడు తన రెండున్నరేళ్ల చిన్నారి కోసం ఎగ్ ఆమ్లెట్ ఆర్డర్ చేస్తే అందులో ఓ బొద్దింక కూడా వచ్చింది. ఆ ఎగ్ ఆమ్లెట్‌ను ఫొటో తీసి ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియుశ్ గోయల్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారత రైల్వే శాఖ ట్విట్టర్ హ్యాండిల్‌లను ట్యాగ్ చేశాడు. ఈ పోస్టులో తాను ప్రయాణిస్తున్న ట్రైన్ వివరాలు కూడా వెల్లడించాడు.

యోగేశ్ మోరే అనే వ్యక్తి ఇలా ట్వీట్ చేశాడు. 2022 డిసెంబర్ 16వ తేేదీన తాము 22222 ట్రైన్‌లో ఢిల్లీకి ప్రయాణించామని వివరించాడు. ఈ రోజు ఉదయం తన పాప కోసం తాను ఎక్స్‌ట్రా ఆమ్లెట్ కోసం ఆర్డర్ చేశానని తెలిపాడు. తాను అటాచ్ చేసిన ఫొటోలు చూడాలని, అందులో తమకు ఏం కనిపించిందో చూడండి అంటూ పేర్కొన్నాడు. ఒక బొద్దింక వచ్చిందని వివరించాడు. తన కూతురు 2.5 సంవత్సరాల బాలిక అని, ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించాడు.

ఈ ట్వీట్‌కు ఇండియన్ రైల్వే రియాక్ట్ అయింది. అంతరాయానికి చింతిస్తున్నాం.. దయచేసి పీఎన్ఆర్ నెంబర్, మొబైల్ నెంబర్ డీఎంలో పంపించగలరని వివరించింది. ఇంతటి సింపుల్ రియాక్షన్ నెటిజన్లకు మరింత కోపం తెప్పించింది. 

Also Read: రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీలపై కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే.?

దీంతో చాలా మంది ఆ ట్వీట్‌తో ఏకీభవించారు. చాలా మంది తాము కూడా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నట్టు పంచుకున్నారు. ప్రీమియమ్ ట్రైన్‌లో ధరలు ప్రీమియమ్‌గా ఉంటాయి గానీ.. సేవలు ప్రీమియమ్‌గా ఉండవని కామెంట్లు చేశారు. ఏది అంతరాయం? పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుంటే ఆర్థికంగా పరిహారం ఇవ్వాలి. ఒక వేళ నేను టికెట్ లేకుండా ప్రయాణించి రైల్వేకు నష్టం చేకూర్చి అంతరాయానికి చింతిస్తున్నాం అంటే సరిపోతుందా?  ఈ ద్వంద్వ వైఖరి వీడాలి అంటూ మరో యూజర్ ఘాటుగా కామెంట్ చేశాడు. 

వారు కేవలం పీఎన్, ఫోన్ నెంబర్ తీసుకుంటారు.. కానీ, పరిష్కారం మాత్రం చూపరు. వారు కేవలం టికెట్ క్రియేట్ చేసి పరిష్కృతమైందని క్లోజ్ చేస్తారేమో అంటూ మరొకరు చురకలంటించారు. ఇండియన్ రైల్వేకు ఇది సిగ్గు చేటు అంటూ విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios