Asianet News TeluguAsianet News Telugu

రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీలపై కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే.?

రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ చేయలేమనీ, ప్రస్తుతం రైల్వే శాఖలో ఖర్చులు తడిసిమో పెడవుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. గత ఏడాది ప్రయాణికుల సేవల కోసం రూ.59 వేల కోట్ల సబ్సిడీ ఇచ్చామన్నారు. 

Ashwini Vaishnav Replied In Lok Sabha On Restoration Of Concession In Train Tickets To Senior Citizens
Author
First Published Dec 14, 2022, 8:00 PM IST

రైల్వే టికెట్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. రైల్వే నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో రాయితీలు పునరుద్ధరించలేమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు మంత్రి అశ్విని వైష్ణవ్  సమాధానమిస్తూ.. గతేడాది ప్రయాణికుల సేవల కోసం రూ.59 వేల కోట్ల సబ్సిడీ ఇచ్చామన్నారు. ఇది భారీ మొత్తం.. చాలా రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ అని కూడా చెప్పారు. దీంతోపాటు రైల్వేశాఖ పెన్షన్, జీతాల బిల్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని మంత్రి తన సమాధానంలో తెలిపారు.
 
కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీని రైల్వే శాఖ ఎత్తివేసింది. అప్పటి నుంచి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై లోక్‌సభలో రైల్వే మంత్రి స్పందిస్తూ ఈ సూచనలు చేశారు.

రైలు ప్రయాణంలో సీనియర్ సిటిజన్లకు రాయితీని ఎప్పుడు పునరుద్ధరిస్తారు? దీనిపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ.. ప్రయాణికుల సేవల కోసం రైల్వే రూ.59,000 కోట్ల సబ్సిడీని ఇచ్చిందని తెలిపారు. ఇది చాలా పెద్ద మొత్తం మరియు కొన్ని రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువ అని తెలిపారు.

అలాగే రైల్వే వార్షిక పెన్షన్ బిల్లు రూ.60,000 కోట్లు, జీతం బిల్లు రూ.97,000 కోట్లు కాగా ఇంధనం కోసం రూ.40,000 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. రైల్వేశాఖ కొత్త సౌకర్యాలు తీసుకువస్తోందని రైల్వే మంత్రి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తీసుకుంటామని తెలిపారు.

అదే సమయంలో రైల్వే మంత్రి మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ .. వందే భారత్ రైళ్ల గురించి కూడా సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం వందేభారత్ రైళ్లను గరిష్టంగా 500 నుంచి 550 కిలోమీటర్ల దూరం నడుపుతున్నట్లు తెలిపారు. ఈ రైళ్లలో ప్రస్తుతం సీటింగ్‌ ఏర్పాటు మాత్రమే ఉంది. ప్రస్తుతం రైల్వే శాఖ స్లీపింగ్ సౌకర్యంతో సుదూర వందే భారత్ రైళ్లను నడపాలని యోచిస్తోందని తెలిపారు.

దేశవ్యాప్తంగా ఉన్న స్టేషన్లకు అయోధ్య అనుసంధానం

రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత దేశంలోని నలుమూలల నుంచి అయోధ్యకు రైళ్లను అనుసంధానం చేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. దీనితో పాటు దేశంలోని 41 ప్రధాన రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి జరుగుతోందనీ, దీనితో పాటు ఇతర స్టేషన్లను కూడా దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నారు. అంతేకాకుండా 2030 నాటికి పూర్తిగా కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఈ దిశగా కూడా పనులు కొనసాగుతున్నాయని రైల్వే మంత్రి తెలిపారు. ఇందుకోసం భారతీయ ఇంజనీర్లు హైడ్రోజన్ రైళ్లను రూపొందించి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios