ముంబయిలోని విమానాశ్రమంలో ఓ ప్రయాణికుడి నుంచి 2.58 కిలోల కొకైన్​ను స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. వీటి విలువ దాదాపు 25 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని తెలిపారు.

ముంబయిలోని డ్రగ్స్ మాఫియా పెట్రేగిపోతోంది. ముఖ్యంగా ముంబయిలోని ఎయిర్ పోర్టు కేంద్రంగా కిలోల కొద్దీ డ్రగ్స్ ను అక్రమంగా తరలిస్తున్నారు. తాజాగా ముంబై విమానాశ్రయంలోని ప్రయాణీకుల నుండి రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ 2.58 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. మంగళవారం (ఫిబ్రవరి 28) నాడు ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆధారంగా .. రెవెన్యూ ఇంటెలిజెన్స్ -డ్రి, ముంబై జోనల్ యూనిట్ ముంబై లు ముంబాయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సిఎస్‌ఎంఐ) సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అడిస్ అబాబా (ఇథియోపియా) నుండి ముంబైకి ప్రయాణిస్తున్న ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన వ్యవహర శైలి భిన్నంగా ఉన్నందున అతడ్ని , అతడి లాగేజీని పరిశీలించగా..12 సబ్బు పెట్టెలు బయటపడ్డాయి. వాటిని క్షుణంగా పరిశీలించగా.. వాటిలో కొకైన్ ఉన్నట్టు తేలింది. 

స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ బరువు 2.58 కిలోలు ఉన్నట్టు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర 25 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. నిందితులను అరెస్టు చేసిన తరువాత, అతన్ని కోర్టులో హాజరు పరచినట్టు తెలిపారు. కోర్టు అతన్ని DRI అదుపుకు పంపింది. ఈ డ్రగ్స్ ఎవరి నుండి వచ్చాయో , ఎక్కడ పంపబడుతున్నాయో DRI విచారిస్తుంది. ఈ కేసులో మరింత దర్యాప్తు జరుగుతోంది.