స్వాతంత్య్ర పోరాటంతో భాగంగా చోటుచేసుకున్న కాకోరీ రైలు చర్యకు వందేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శతాబ్ది ఉత్సవాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు.

DID YOU
KNOW
?
కాకోరి రైలు దోపిడి
స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా జరిగిన కాకోరీ రైలుదోపిడీ వ్యవహారంలో మొత్తం 40 మందిని అరెస్ట్ చేసింది ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం.

భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కాకోరీ రైలు చర్యకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 1925 ఆగస్ట్ 9న కాకోరి-లక్నో స్టేషన్ల మధ్య ఆంగ్లేయులు ప్రయాణించే రైలును దోపిడీ చేశారు. ఇంలో రాంప్రసాద్ బిస్మిల్లా, అష్పకుల్లా ఖాన్, చంద్రశేఖర్ అజాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చర్యకు రేపటితో వందేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా యూపీ ప్రభుత్వం శతాబ్ది ఉత్సవాలను నిర్వహించింది. 

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన విప్లవకారులకు హృదయపూర్వక నివాళులర్పించారు. యువతరానికి దేశభక్తి, స్వదేశీని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. "స్వదేశీ మన జీవిత లక్ష్యం, మంత్రం కావాలి. మనం దేశం కోసం బ్రతుకుతాం, దేశం కోసం చనిపోతాం. ఈ దేశభక్తి స్ఫూర్తితో భారతదేశం ముందుకు సాగితే ప్రపంచంలో ఏ శక్తి మనల్ని ఏమీ చేయలేదు. స్వాతంత్య్ర సందేశం ఈ సంకల్పంతో ముందుకు సాగడానికి మనందరికీ స్ఫూర్తినిస్తుంది'' అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కాకోరీ రైలు చర్యలోని వీరులను గుర్తుచేసుకున్నారు. వారి గుర్తుగా వేదిక వద్ద రావి చెట్టును నాటారు. చిన్నారులు కట్టిన రాఖీలు కట్టుకుని రక్షాబంధన్ వేడుకలో పాల్గొన్నారు. వారికి స్వీట్లు, చాక్లెట్లు బహుమతిగా ఇచ్చారు. మ్యూజియంలో ఫోటోలు, సెల్ఫీలు దిగారు. వేదికపై వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను సత్కరించారు. చారిత్రాత్మక కాకోరీ సంఘటన ఆధారంగా రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించింది. కాకోరీ రైలు చర్య నాటకాన్ని ప్రదర్శించారు.