CM Yogi: ఉత్తరప్రదేశ్ లో నేరస్థులు, మాఫియాపై చేపట్టిన బుల్డోజర్ ఆపరేషన్ సీఎం యోగి సమర్థించారు.  ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా లాక్కున్నావారికి మంగళం పాడాలని అన్నారు.  

CM Yogi: ఉత్తరప్రదేశ్‌లో నేరస్థులు, మాఫియాపై చేపట్టిన బుల్డోజర్ చర్యను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమర్థించారు. ప్రభుత్వ ఆస్తులను అక్రమంగా లాక్కున్న వ్యక్తులకు మంగళం పాడాలా ? అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని యూపీ ప్రజలు కోరారు.

తాను ఉత్తరప్రదేశ్‌కు ఆరున్నరేండ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నానని, 2017 నుంచి రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు జరగలేదని సీఎం యోగి అన్నారు. గత 6 ఏండ్లలో ఎలాంటి కర్ఫ్యూ నిర్వహించలేదనీ, అసలూ యూపీలో అల్లర్లు తావులేదని అన్నారు. హిందువులు అన్ని పండుగలు ప్రశాంతంగా జరుపుకున్నారని, తాము వంచనను ఆశ్రయించలేదని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, సమర్థులైతే గెలుస్తారన్నారు. ఇది ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొన్నారు.

ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనార్జీపై మండిపడ్డారు. బెంగాల్‌లో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారనీ, ఈ అంశంపై ఎవరూ మాట్లాడటం లేదనీ, అందరూ మౌనంగా ఉండిపోయారని అన్నారు.

మణిపూర్ అంశంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. మణిపూర్‌లో మళ్లీ శాంతి నెలకొంటుందని, అక్కడి బీజేపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న అభివృద్ధి ప్రక్రియ వేగంగా పురోగమిస్తుంది. అంతే కాకుండా జ్ఞాన్వాపి విషయంపై ఆయన మాట్లాడుతూ మసీదు అని పిలిస్తే వివాదాలు వస్తాయని, జ్ఞానవాపి అని పిలవాలని అన్నారు. 

మసీదు లోపల జ్యోతిర్లింగం ఉందనీ, దేవతా విగ్రహాలు ఉన్నాయని అన్నారు. కానీ కొందరూ మేధావు దాని చరిత్రను వక్రీకరిస్తున్నారనీ, కానీ, అక్కడి గోడలపై ఉన్న చారిత్రక ఆధారాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం వెతకాలని ముస్లిం వైపు నుంచి కూడా ప్రతిపాదన రావాలని కోరారు.