ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై యూపీ ముఖ్య‌మంత్రి (up cm) యోగి ఆదిత్య‌నాథ్ ( yogi adityanath ) స్పందించారు. తాను పోటీ చేసే అంశంపై అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంటుందని ఆయ‌న కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న త‌ర్వాతే ఎన్నిక‌ల బ‌రిలో దిగుతాన‌ని సీఎం తెలిపారు

వచ్చే ఏడాది జరగనున్న ఉత్త‌రప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లకు ఇప్పటి నుంచే పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు యూపీ అత్యంత కీలకం. దేశంలోనే అతిపెద్ద రాష్టం కావడంతో పాటు నేరుగా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించే అవకాశాన్ని ఉత్తరప్రదేశ్ అందిస్తుంది. ఇకపోతే అక్కడి ప్రాంతీయ పార్టీలైన బీఎస్సీ (bsp), ఎస్పీలు (sp)సైతం తిరిగి పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అంశంపై రాజ‌కీయ పార్టీలు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై యూపీ ముఖ్య‌మంత్రి (up cm) యోగి ఆదిత్య‌నాథ్ ( yogi adityanath ) స్పందించారు. తాను పోటీ చేసే అంశంపై అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంటుందని ఆయ‌న కీలక వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న త‌ర్వాతే ఎన్నిక‌ల బ‌రిలో దిగుతాన‌ని సీఎం తెలిపారు. నియోజ‌క వ‌ర్గం విషయంపై కూడా అప్పుడే స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని చెప్పారు. త‌నతో పాటు పార్టీ నేత‌లందరూ ఎక్క‌డి నుంచి పోటీ చేయాల‌న్న విష‌యం బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు నిర్ణ‌యిస్తుంద‌ని యోగి వెల్లడించారు. గ‌త ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌న్నింటినీ తమ ప్రభుత్వం నెర‌వేర్చింద‌ని ఆయన చెప్పారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడామ‌ని ముఖ్యమంత్రి అన్నారు.

ALso Read:ఐఎస్ఐ అడుగుజాడల్లో అఖిలేష్‌.. అందుకే జిన్నాపై ప్రశంసలు: యూపీ మంత్రి సంచలన ఆరోపణలు

మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు (uttar Pradesh assembly polls) సమయం దగ్గరపడుతున్న వేళ ప్రధాన పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. సమాజ్‌వాది పార్టీ చీఫ్ (samajwadi party) , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌పై (akhilesh yadav) ఆ రాష్ట్ర మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా (anand swaroop shukla) ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ (isi) నుంచి అఖిలేష్ యాదవ్‌కు ఆర్థిక సాయం అందుతోందన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ముస్లీంల ఓట్ల కోసం అఖిలేష్ యాదవ్ తన మతాన్ని మార్చుకున్నా ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదని శుక్లా అన్నారు. 

కాగా.. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ Pakistan జాతిపితగా భావించే Muhammad Ali Jinnahను ప్రస్తావించారు. భారత స్వాతంత్ర్య సమర యోధులతోపాటుగా ఆయన పేరును పేర్కొన్నారు. సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, జిన్నాలు ఒకే విద్యా సంస్థలో చదువుకున్నారని వివరించారు. వారంతా బారిస్టర్‌లు అయ్యారని తెలిపారు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారని అన్నారు. ఇదే కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్‌ పైనా విమర్శలు చేశారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ (vallabhbhai patel) ఒక భావజాలాన్ని నిషేధించారని గుర్తుచేశారు. దేశాన్ని మతం, కులాల ఆధారంగా ఆ భావజాలం విభజిస్తుందని ఆయన పసిగట్టారని, అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారని పరోక్షంగా ఆర్ఎస్ఎస్‌పై వ్యాఖ్యలు చేశారు.