కుంభమేళాకు ఒకే రోజు 10 కోట్లమంది వచ్చినా... ఇబ్బంది లేకుండా యోగి 15 ప్లాన్స్ రెడీ
మౌని అమావాస్య, వసంత పంచమికి 8-10 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వస్తారని అంచనా. కాబట్టి కట్టుదిట్టమైన భద్రతతో పాటు రద్దీని నియంత్రించడం, కమ్యూనికేషన్‌ను మెరుగుపరచాలని సీఎం యోగి ఆదేశించారు. మేళా ప్రాంతం నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు.

ప్రయాగరాజ్: 2025 మహా కుంభమేళకు దేశవిదేశాల నుంచి కోట్ల మంది భక్తులు గంగానదిలో స్నానం చేసేందుకు వస్తున్నారు. ముఖ్యంగా షాహీ స్నానం సందర్భాల్లో ప్రయాగరాజ్‌లో అడుగు పెట్టేందుకు కూడా చోటు ఉండదు. రానున్న మౌని అమావాస్య, వసంత పంచమి, గణతంత్ర దినోత్సవం సందర్భంగా కుంభమేళా ప్రాంతంలో జనసందోహం మరింత పెరుగుతుంది. కాబట్టి రద్దీ నియంత్రణ, కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరచాలని సీఎం యోగి ఆదేశించారు. మౌని అమావాస్య రోజున 8-10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.
రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి కూడా కుంభమేళాకు వస్తారు
ఆదివారం ప్రయాగరాజ్‌కు వచ్చిన సీఎం యోగి మొదట మేళా ప్రాంతాన్ని పరిశీలించి, అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. రానున్న రోజుల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రితో సహా పలువురు ప్రముఖులు ప్రయాగరాజ్‌కు వస్తారని, జనవరి 22న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా ఇక్కడ జరుగుతుందని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని సీఎం అన్నారు.
సీఎం యోగి ఆదేశాలు
1. మౌని అమావాస్య, వసంత పంచమి రోజున మేళా ప్రాంతంలో వాహనాలకు నిషేదం, పాంటూన్ వంతెనపై వన్-వే
2. గణతంత్ర దినోత్సవం, మౌని అమావాస్య, వసంత పంచమికి రద్దీని నియంత్రించేందుకు ప్రణాళిక, కాల్ డ్రాప్‌లు లేకుండా చూడాలి
3. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 5 వరకు కుంభమేళాకు ప్రత్యేక ప్రణాళిక అమలు
4. స్నాన పర్వదినాల్లో రోజంతా ప్రత్యేక రైళ్లు నడపాలి, ప్లాట్‌ఫారాలు మారకుండా చూడాలి
5. మౌని అమావాస్యకు 8-10 కోట్ల మంది భక్తులు వస్తారు, భద్రత, పారిశుధ్యానికి ప్రత్యేక శ్రద్ధ
6. విద్యుత్, నీరు, ఘాట్‌లు, ట్రాఫిక్, పారిశుధ్యం, టాయిలెట్స్, బస్సులు, రైళ్లపై అప్రమత్తంగా ఉండాలి
7. రెగ్యులర్ రైళ్లు, మేళా స్పెషల్ రైళ్లకు వేర్వేరు స్టేషన్లు ఉంటే మంచిది
8. భక్తులకు సహాయం చేయాలి
9. ఉదయం నుంచే షటిల్ బస్సులు నడపాలి, బస్సుల సంఖ్య పెంచాలి
10. మేళా ప్రాంతంతో పాటు ఘాట్‌ల భద్రతపై దృష్టి
11. విద్యుత్, తాగునీరు, టాయిలెట్స్, పారిశుధ్యం, పాంటూన్ వంతెనల నిర్వహణ, జనసమూహాల కదలికలపై ప్రణాళిక
12. మౌని అమావాస్యను దృష్టిలో పెట్టుకుని టవర్ల సామర్థ్యం, కవరేజీ పెంచాలి
13. మకర సంక్రాంతి అనుభవంతో స్నానం తర్వాత భక్తులు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు రోజంతా స్పెషల్ రైళ్లు నడపాలి
14. డిజిటల్ ఖోయా పాయా కేంద్రం సజావుగా నడపాలి
15. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి, సేవ చేయాలనుకునే వారికి అవకాశం కల్పించాలి

