రేయాన్‌లో లాగే.. పాఠశాల టాయిలెట్‌లో విద్యార్థి హత్య

Class 9 Student dead body found in School Washroom At Vadodara
Highlights

రేయాన్‌లో లాగే.. పాఠశాల టాయిలెట్‌లో విద్యార్థి హత్య

గుజరాత్‌లోని వడోదరలో దారుణం జరిగింది... పాఠశాల టాయిలెట్‌లో విద్యార్థిని దారుణంగా హత్య చేశారు.. తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండగా పాఠశాల సిబ్బంది గుర్తించారు.. బాలుడి శరీరంపై పదునైన కత్తి గాయాలున్నాయి.. అతని పక్కనే హత్యకు ఉపయోగించిన కత్తిని పడేశారు.. దీనిపై యాజమాన్యానికి సమాచారం అందించగా.. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి వచ్చి.. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పాఠశాల సిబ్బందిలో ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా..? లేదంటే బయటి వ్యక్తులు లోపలికి ప్రవేశించి విద్యార్థిని చంపారా అన్నది తెలియాల్సి ఉంది.. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను వెతికే పనిలో పడ్డారు పోలీసులు.  కాగా, గతేడాది గుర్గావ్‌లోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూలులో ఓ ఏడేళ్ల విద్యార్థి ఇదే తరహాలో హత్యకు గురయ్యాడు.. విచారణలో బస్సు డ్రైవరే చిన్నారిని చంపినట్లు తేలింది. 

loader