Asianet News TeluguAsianet News Telugu

'మొహర్రం' వేడుకల్లో అపశ్రుతి.. 8 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు.. భారీగా ఆస్తి నష్టం..

భారతదేశం అంతటా మొహర్రం (Moharram) వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే.. ఈ వేడుకల సందర్భంగా పలు చోట్ల అపశ్రుతులు కూడా చోటుచేసుకున్నాయి. మొహర్రం ఊరేగింపులలో ప్రమాదాల కారణంగా కనీసం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.

clashes during Muharram procession in Delhi and UP 8 killed, vehicles damaged KRJ
Author
First Published Jul 30, 2023, 4:18 AM IST

దేశవ్యాప్తంగా మొహర్రం (Moharram) వేడుకలు  ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు చోట్ల అపశ్రుతులు కూడా చోటుచేసుకున్నాయి. మొహర్రం ఊరేగింపులలో ప్రమాదాల కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. జార్ఖండ్‌లోని బొకారో, యుపిలోని అమ్రోహాలో విద్యుతాఘం ఘటనలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో ఇటువంటి ప్రమాదాలు చాలా చోట్ల కూడా జరిగాయి. ఈ ప్రమాదాల్లో 6 మంది మరణించారు. ఇది కాకుండా.. ఢిల్లీలోని నాగ్లోయ్‌లో ఊరేగింపు నిమజ్జనం సందర్భంగా రాళ్ల దాడి జరిగింది, ఆ తర్వాత పోలీసులకు, స్తానికులకు మధ్య ఘర్షణ చోటుచేసుకున్నాయి.  

నిజానికి..  మొహర్రం ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెల. ఈ నెల 10వ తేదీని యోమ్-ఎ-అషురా అంటారు. ఈ రోజున ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్ యొక్క వీరత్వాన్ని స్మరించుకుంటారు. సంతాపం తెలియజేస్తారు. హజ్రత్ ఇమామ్ హుస్సేన్‌కు ప్రధాని మోదీ సహా నేతలంతా నివాళులర్పించారు. మొహర్రం సందర్భంగా ఊరేగింపునకు రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్‌లో జరిగిన ముహర్రం ఊరేగింపులో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. గత 35 ఏళ్ల తర్వాత.. ఇక్కడి వేడుకల్లో దేశనేతలు పాల్గొనడం విశేషం.  

ఢిల్లీలో ఘర్షణలు

వారణాసిలోని దోషిపుర ప్రాంతంలో షియా, సున్నీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి, ఈ సందర్భంగా అనేకమంది గాయపడ్డారు.పలు వాహనాలు దెబ్బతిన్నాయి. అలాగే.. ఢిల్లీలో ఉత్సవ నిర్వహకులకు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొంతమంది దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 12 మంది పోలీసులు గాయపడ్డారు. అంతేకాకుండా ఘర్షణల్లో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

ఘర్షణల తరువాత పరిస్తితి అదుపులోకి తీసుకోవడానికి  పోలీసులు లాఠీచార్జిని చేశారు. ఈ ఘటనపై డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (అవుటర్) హరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. మొహర్రం ఊరేగింపు నిర్వాహకులు తమ ఊరేగింపును ముందుగా నిర్ణయించిన మార్గం నుంచి కాకుండా.. కొత్త మార్గం నుంచి మళ్లించడానికి ప్రయత్నించడంతో ఘర్షణ ప్రారంభమైందని తెలిపారు. మళ్లింపుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని నియంత్రించడానికి, గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ-ఛార్జ్ చేశారు.  ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని డీసీపీ తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లో ఘర్షణలు

మొహర్రం-సంబంధిత సంఘటనలో ముహర్రం ఊరేగింపులో 'షియా', 'సున్నీ' ముస్లిం సంఘాల సభ్యుల మధ్య హింసాత్మక ఘటనలు, రాళ్ల దాడి జరిగింది, ఫలితంగా కొన్ని గాయాలు అయ్యాయి. అయితే క్షతగాత్రుల సంఖ్య కచ్చితంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. అలాగే.. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో మరో  విషాద సంఘటన చోటుచేసుకుంది.

మొహార్రం వేడుకల్లో హై-వోల్టేజ్ కరెంట్ వైర్‌లను తాకడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.52 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమోరోహా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ఆదిత్య లాంగెహ్ తెలిపిన వివరాల ప్రకారం..  మృతులను షాను (35), ఒవైస్ (13)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని చికిత్స కోసం ఢిల్లీకి తరలించినట్లు లాంగే తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. హైటెన్షన్ వైర్‌లు తాకడంతో మంటల్లో చిక్కుకోని ఓ  వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

 జార్ఖండ్‌లో ప్రమాదం..

శనివారం జార్ఖండ్‌లోని బొకారోలో జరిగిన ముహర్రం ఊరేగింపులో నలుగురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారు, మరో 13 మంది గాయపడ్డారు. ప్రమాదశాత్తు 11,000 హై-వోల్టేజ్ టెన్షన్ వైర్లను  తాకడంతో ఈ సంఘటన జరిగింది. ఫలితంగా పేలుడు సంభవించింది. మృతులను సాజిద్ అన్సారీ (18), ఆషిఫ్ రజా (21), గులాం హుస్సేన్ (19), ఇనాముల్ రబ్ (34)గా గుర్తించారు. నలుగురి మృతి పట్ల జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంతాపం వ్యక్తం చేశారు.

గుజరాత్‌లో సంఘటనలు

గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో ముహర్రం ఊరేగింపు సందర్భంగా విద్యుదాఘాతం కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, 22 మంది గాయపడ్డారు. నగరంలోని రసూల్ పారా ప్రాంతంలో 22 కేవీ ఓవర్ హెడ్ విద్యుత్ వైరుకు 'తాజియా' తగలడంతో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. మృతులను జునైద్ మజోతి (22), సాజిద్ సామా (20)గా గుర్తించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios