ఏపీ టోల్ ప్లాజా దగ్గర తమిళ విద్యార్థులు, టోల్ సిబ్బందికి మధ్య బీభత్సమైన ఘర్షణ జరిగింది. ఫాస్టాగ్ పేమెంట్ సంబంధ సమస్యగా మొదలై పదుల సంఖ్యలో గొడవపడేలా ముదిరింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఓ టోల్ ప్లాజా దగ్గర బీభత్సమైన ఘర్షణ చోటుచేసుకుంది. ఏపీలో పరీక్ష రాసి తిరిగి తమిళనాడుకు వెళ్లిపోతున్న లా స్టూడెంట్లు, టోల్ ప్లాజా సిబ్బందికి మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఆ తర్వాత స్థానికులు కూడా ఇందులో చేరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వీడియోలో పదుల సంఖ్యలో కనిపించారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఉండగా.. మరికొందరు ప్రాణాలు కాపాడుకుంటూ పరుగులు పెట్టారు. ఇంకొందరైతే ఐరన్ రాడ్లు, కర్రలతో దాడి చేస్తుండగా ఓ వ్యక్తి స్కూటీ వేసుకుని ప్రత్యర్థులపైకి ఎక్కించాలని ప్రయత్నించినట్టు కనిపించింది. ఈ ఘర్షణల్లో కనీసం పది మంది తమిళ విద్యార్థులు గాయపడినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.

తిరుపతిలో వడమలపేట సమీపంలోని ఎస్‌వీ పురం టోల్ ప్లాజా దగ్గర ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను తిరువల్లూర్ ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్చినట్టు సమాచారం. 

Scroll to load tweet…

లా స్టూడెంట్లలో ఒకరు ఈ ఘటన గురించి మాట్లాడారు. టోల్ ప్లాజాకు చేరగానే తమ ఫాస్టాగ్ స్కాన్ చేశారని వివరించారు. అయితే, ఫాస్టాగ్ అకౌంట్‌లో సరైన బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయడం లేదని రూ. 160 పే చేయాలని సిబ్బంది అడిగారని, కానీ, టోల్ కేవలం రూ. 40 అయితే.. 160 ఎందుకు అడుగుతున్నారని తాము తిరిగి ప్రశ్నించామని తెలిపారు. రూ. 40లు తమ ఫాస్టాగ్ అకౌంట్‌లో ఉన్నాయని బదులిచ్చినట్టు పేర్కొన్నారు. ఇలా అడిగిన మెషీన్‌లోనే ఫాల్ట్ ఉందని, తన పాస్టాగ్ అకౌంట్‌లో టోల్ ఫీజుకు సరిపడా డబ్బులు ఉన్నాయని వివరించినట్టు తెలిపారు.

Also Read: Viral video: టోల్ ప్లాజా వద్ద జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.. గన్స్ కాదు బూట్లు చాలు గురూ.. !

అయినప్పటికీ రూ. 160 డిమాండ్ చేయడంతో ఇతర విద్యార్థులు కూడా ఆ కారులో ఉన్న విద్యార్థికి మద్దతుగా అక్కడికి చేరారు. ఆ ఉద్యోగి వైపు కూడా సుమారు 20 మంది సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఇంతలో ఓ విద్యార్థి స్టాఫ్ పై చేయి చేసుకోవడంతో గొడవ పెద్దదైంది.

కాగా, పేమెంట్ సంబంధ ఇష్యూ కావడంతో వాగ్వాదం జరుగుతున్న కారణంగా ఆ కారు వెనుకాల క్యూ పెరిగిపోయిందని, కాబట్టి, ఆ కారును పక్కన పెట్టాలని స్టాఫ్ సూచించినట్టు తెలిసింది. దీంతో ఆ విద్యార్థులు కారును పక్కన పెట్ట లేదని, అంతేకాకుండా కేవలం తమిళనాడు నంబర్ ప్లేట్లు ఉన్నవాటిని మాత్రమే పంపి మిగతా కార్లను అక్కడే అడ్డుకున్నారని ఎన్డీటీవీ పేర్కొంది. ఆ తర్వాత గొడవ ముదిరిందని తెలిపింది.

Also Read: టోల్ బూత్ ఉద్యోగినిపై దాడి.. చెప్పుతో బదులిచ్చిన మహిళ.. వైరల్ వీడియో ఇదే

పోలీసులు అక్కడికి వచ్చినప్పటికీ గొడవను అంత సులువుగా సద్దుమణిగించలేకపోయారు. స్థానికులు, ఇతర ప్రయాణికులు కూడా ఈ ఘర్షణ లోకి దూరారు. దీంతో ఘర్షణ ఊహించినదాని కంటే మించి పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.