వృత్తి ఏదైనా చాలా మంది వ్యక్తిగతంగా కొన్ని అలవాట్లు ఉంటాయి. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్న తమలో ఉన్న వేరే ప్రతిభను అప్పుడప్పుడు కొందరు వెలికితీస్తూ ఉంటారు. తాజాగా... సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే అదే చేశారు. ఆదివారం చేతిలో బ్యాట్ పట్టుకొని మైదానంలో పరుగులు తీశారు. తన సహచరులతో కలిసి ఆట ఆడిన ఆయన... అత్యధిక పరుగులు చేయడం విశేషం.

Also Read కలెక్టర్ ని జట్టుపట్టుకొని లాగిన బీజేపీ నేత.. ఆమె ఏంచేసిందటే....

రెండు రోజుల పర్యటన నిమిత్తం మహారాష్ట్రకు వచ్చిన బాబ్డే సహచరులతో కలిసి క్రికెట్ ఆడారు. నాగపూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ ఎలెవన్ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించారు. 15ఓవర్ల ఈ మ్యాచ్ లో ఆల్ జడ్జెస్ జట్టు తరపున బరిలోకి దిగిన బాబ్డే 18 పరుగులు చేశారు. కాగా... మ్యాచ్ లో అత్యధిక స్కోరు అదే కావడం గమనార్హం. ఆయన ప్రాతినిద్యం వహించిన జట్టు విజయం సాధించగా... ఆ విజయంలో ఆయన కీలక పాత్ర పోషంచారు. తనకు క్రికెట్ ఆడటం అంటే ఎంతో సంతోషమని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.