న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు క్లిన్ చిట్ ఇచ్చింది.

సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సోమవారం నాడు ఓ ప్రకటనను విడుదల చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్  రంజన్ గొగోయ్‌పై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు  స్పష్టం చేసింది. గత నెల 19వ తేదీన మాజీ ఉద్యోగిని లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసింది.