పౌరసత్వ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. సభలో 230 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా.. ఈ బిల్లుకు అనుకూలంగా  125 మంది, వ్యతిరేకంగా 105 మంది ఓటు వేశారు. దీంతో పార్లమెంట్‌లోని ఉభయసభల్లో పౌరసత్వ బిల్లు ఆమోదం పొందినట్లయ్యింది. 

అంతకుముందు పౌరసత్వ బిల్లుపై బుధవారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలంటూ జరిగిన ఓటంగ్‌లో కమిటికి పంపొద్దంటూ 124 మంది, పంపాలని 99 మంది సభ్యులు ఓటు వేశారు.

దీంతో బిల్లును సెలక్ట్ కమిటికీ పంపాలనే ప్రతిపాదన వీగిపోయింది. లోక్‌సభలో మద్ధతిచ్చిన శివసేన.. రాజ్యసభలో మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉంది. చర్చ ప్రారంభమైన వెంటనే ఆ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. 

Also read:గోద్రా అల్లర్ల వెనుక కుట్ర లేదు: మోడీకి నావావతి కమిషన్ క్లీన్ చీట్

అంతకుముందు పౌరసత్వ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్ధతు పలికింది. బుధవారం పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో వాడి వేడి చర్చ జరిగింది. దీనిపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. పౌరసత్వంపై గతంలో అనేకమంది తమ అభిప్రాయాలను వెల్లడించారని.. బంగ్లాదేశ్‌ ముస్లిం చొరబాటుపై 2017లో ప్రణబ్ ముఖర్జీ మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.

ఈ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్థతు ఇస్తుందని.. అయితే దీనిపై కొన్ని వివరణలు కావాలని కనకమేడల కోరారు. కాగా పౌరసత్వ బిల్లుకు లోక్‌సభలోనూ టీడీపీ మద్ధతు తెలిపిన సంగతి తెలిసిందే. అంతకు ముందు పౌరసత్వ సవరణ బిల్లు-2019కు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

Also read:ప్రేమించాడు.. ఒప్పుకోలేదని బస్సులోనే బలవంతంగా...

ఏడు గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్థరాత్రి 12 గంటలకు నిర్వహించిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 311 మంది, వ్యతిరేకంగా 80 మంది ఓటేశారు. దీంతో ఈ బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

ఈ బిల్లుకు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈశాన్య ప్రాంతాల్లోని జాతులను తుడిచే పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ట్వీట్ చేశారు.