Asianet News Telugu

సినిమా పిచ్చితో నిజంగానే పిచ్చి... పోలీసు మానవతామూర్తి దాతృత్వం

ఒకవేళ భారతి ఎవరైనా మృగాళ్ల కంటపడి ఉంటే పరిస్థితి ఏమై ఉంటుందో తలుచుకోవడానికే భయమేస్తుందని ఆ ఇన్స్పెక్టర్ అన్నారు. 

Cinema Craze drives A Girl Insane, Becomes Lunatic, Cop Becomes Saviour
Author
Chennai, First Published Jul 14, 2020, 8:14 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సినిమా పిచ్చి ఒక యువతిని నిజంగానే పిచ్చిదాన్ని చేసిన ఘటన చెన్నైలో పరిధిలో చోటు చేసుకుంది. సినిమా వ్యామోహంతో ఇంట్లోనుండి వెళ్ళిపోయి చెన్నై వీధుల్లో మతి స్థిమితం కోల్పోయి తిరుగుతూ చివరకు ఒక మహిళా ఎస్సై కంటపడి షెల్టర్ హోమ్ కు చేరుకుంది. 

ఈ గుండెల్ని పిండేసే ఘటన వివరాల్లోకి వెళితే.... చెన్నై అంతా లాక్ డౌన్ లో ఉండడంతో అన్ని వీధులు నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు గస్తీ తిరుగుతుండగా... మాధవరం ప్రాంతంలో విధుల్లో ఉన్న మహిళా ఇన్స్పెక్టర్ కి చెత్తకుండీ ప్రక్కన ఎవరో ఉన్నట్టనిపించి డ్రైవర్ ని జీపు ఆపమని చెప్పింది. 

అక్కడకు వెళ్లి చూడగా... చింపిరి జుట్టుతో, మాసిన బట్టల్లో ఒక అందమైన యువతీ కూర్చొని ఉంది. ఆ యువతీ అలా చెత్తకుండీ పక్కన ఉండడంతో... ఒక్కసారిగా షాక్ కి గురైన పోలీసు ఆమెను చెయ్యిపట్టుకొని పైకి లేపింది. 

పైకి లేచిన ఆ యువతీ మహిళా ఇన్స్పెక్టర్ ని చూస్తూ... మీరు పోలీసా అని అడగగా అవునని సమాధానం చెప్పింది. తనకు తినడానికి ఏమైనా కావాలని అడగడంతో... తనతో తెచ్చుకున్న ఫలాస్క్ లోని ఛాయ్ ని ఆమెకు ఇచ్చింది. ఆతృతగా ఆ టీ తగిన ఆ యువతిని చిన్నగా జీప్ ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లింది. 

పోలీస్ స్టేషన్ లోని కానిస్టేబుల్లో ఆ యువతికి స్నానం చేపించి కొత్త బట్టలను తొడిగారు. చిన్నగా ఆ యువతితో మాటలుకలిపిన మహిళా ఇన్స్పెక్టర్ రాజేశ్వరి, చిన్నగా యువతీ వివరాలను రాబట్టింది. 

ఆ యువతీ పేరు భారతి అని తండ్రి చెన్నై శాస్త్రి భవన్ లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందాడని, తెలిపింది. తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో అత్త దగ్గర ఉంటున్నట్టుగా చెప్పింది. గంటపాటు పోలీసులు వెదికి అత్తను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చినప్పటికీ... అత్త మాత్రం ఈ యువతిని తమ ఇంట్లో ఉంచుకోవడానికి అంగీకరించలేదు. 

అత్త అంగీకరించకపోవడంతో..... భారతి సోదరి కూడా చెన్నైలోనే ఉంటుందని తెలుసుకొని భారతి సోదరి ఇంటికి వెళ్లగా ఆమె మరిన్ని విస్తుపోయే విషయాలను చెప్పింది. 

భారతి మరో సోదరికి సచిన్ టెండూల్కర్ అన్న, క్రికెట్ అన్నా పిచ్చి ప్రేమ అట. సచిన్ నే పెళ్లాడతానంటూ మొండికేయడంతో అతనికి పెళ్లయిందని కుటుంబ సభ్యులు వారించారు. ఆ తరువాత యువరాజ్ సింగ్ ని ప్రేమిస్తున్నానంటూ అతనిపై ఇష్టం పెంచుకుంది. యువరాజ్ సింగ్ కి నిశ్చితార్థం జరిగిందని తెలియగానే ఉరేసుకొని మరణించినట్టుగా తెలిపింది. 

భారతి డిగ్రీ పూర్తి చేసిందని, సినిమాలపై ఉన్న పిచ్చి, అభిషేక్ బచ్చన్ అంటే ఉన్న వ్యామోహంతో... వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టెదని, అలా చేస్తూ క్రమంగా పిచ్చిదానిలా మారిపోయిందని చెన్నైలో నివాసముంటున్న ఆమె సోదరి తెలిపింది. భారతిని ఉంచుకోవడానికి ఆమె కూడా నిరాకరించింది. 

చేసేదేమిలేక భారతిని తిరిగి పోలీస్ స్టేషన్ కి చేర్చి భారతిని ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించే ప్రయత్నం చేయగా, కరోనా కారణంగా ఎవ్వరిని చేర్పించుకోవడంలేదని వారు తెలిపారు. చివరకు చెన్నై కార్పొరేషన్లోని ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించాలని వేరే ఎస్సైకి ఫోన్ చేయడంతో దానికి ఆమె అంగీకరించింది. 

ఒకవేళ భారతి ఎవరైనా మృగాళ్ల కంటపడి ఉంటే పరిస్థితి ఏమై ఉంటుందో తలుచుకోవడానికే భయమేస్తుందని ఆ ఇన్స్పెక్టర్ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios