సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఆరు మాసాల జైలు శిక్షను విధించింది కోర్టు. 

చెన్నై: సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఆరు మాసాల జైలు శిక్షను విధించింది కోర్టు.జయప్రదతో పాటు మరో ముగ్గురికి కూడ జైలు శిక్ష విధించింది చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు. అంతేకాదు ఒక్కొక్కరికి రూ.5 వేల జరిమానాను కూడ విధించింది. చెన్నైలోని రాయపేటలో జయప్రద ఓ సినిమా థియేటర్ ను నడిపారు

చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి అన్నారోడ్డులో సినిమా థియేటర్ ను నడిపించారు. సినిమా థియేటర్ లో పనిచేస్తున్న కార్మికుల నుండి వసూలు చేసిన ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లించలేదు. దీంతో ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించారు కార్మికులు.అయితే ఈ పిటిషన్ ను కొట్టివేయాలని జయప్రద దాఖలు చేసిన మూడు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ పై విచారించిన ఎగ్మోర్ కోర్టు ఇవాళ జయప్రదతో పాటు మరో ముగ్గురికి ఆరు మాసాల జైలు శిక్షను విధించింది. టీడీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు సినీ నటి జయప్రద. కొంత కాలం తర్వాత టీడీపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె సమాజ్ వాదీ పార్టీలో చేరారు. సమాజ్ వాదీ పార్టీకి కూడ గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు.