రెండు దేశాల్లో చిన్నారుల మరణానికి ఇండియాలో తయారైన దగ్గు మందులు కారణమని వచ్చిన ఆరోపణలు అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీశాయి. ఈ విషయం రెండు పార్టీల నాయకులు తమ ట్వీట్ల ద్వారా వాగ్వాదానికి దిగారు.
ఉజ్బెకిస్థాన్, గాంబియా దేశాల్లో చిన్నారుల మరణాలకు భారతీయ ఫార్మా కంపెనీల దగ్గు మందులే కారణమని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య గురువారం మాటల యుద్ధం జరిగింది. ‘భారతదేశం ప్రపంచానికి ఫార్మసీ’ అనే ప్రగల్భాలు పలకడం మానేసి, ఈ ఘటనలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీనికి స్పందించిన అధికార పార్టీ బీజేపీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల ఉన్న ద్వేషంతో కాంగ్రెస్ భారతదేశాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపించింది.
ఎఫ్ఎంజీఐ పాస్ కాకుండానే ప్రాక్టీస్.. 73 మంది డాక్టర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
‘‘మేడ్ ఇన్ ఇండియా దగ్గు సిరప్‌లు ప్రాణాంతకంగా కనిపిస్తున్నాయి. మొదట గాంబియాలో 70 మంది చిన్నారులు మరణించారు. ఇప్పుడు ఉజ్బెకిస్థాన్‌లో 18 మంది చిన్నారులు చనిపోయారు. మోడీ సర్కార్ భారతదేశం ప్రపంచానికి ఫార్మసీ అని గొప్పలు చెప్పుకోవడం మానేసి కఠిన చర్యలు తీసుకోవాలి.’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
దీనికి బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా బదులిస్తూ.. ‘‘గాంబియాలో పిల్లల మరణానికి, భారతదేశంలో తయారైన దగ్గు సిరప్ వినియోగానికి ఎలాంటి సంబంధమూ లేదు. ఆ విషయాన్ని గాంబియా అధికారులు, డీసీజీఐ ఇద్దరూ స్పష్టం చేశారు. మోడీపై ద్వేషంతో కాంగ్రెస్ భారతదేశాన్ని, దాని వ్యవస్థాపక స్ఫూర్తిని అవహేళన చేస్తూనే ఉంది. ఇది సిగ్గుచేటు.’’ అని అన్నారు.
కాగా.. ఉజ్బెకిస్థాన్‌లో 18 మంది చిన్నారులు మరణించిన ఘటనపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీవో) దర్యాప్తు ప్రారంభించిందని, ఇందులో ఓ భారతీయ సంస్థ తయారు చేసిన దగ్గు సిరప్‌తో సంబంధం ఉందని అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి. అంతకు ముందు కూడా గాంబియాలో చిన్నారుల మరణానికి భారత్‌లో తయారు చేసిన దగ్గు సిరప్‌లు కారణం అని పలు ఆరోపణలు వచ్చాయి. అయితే దగ్గు సిరప్ వినియోగానికి, పిల్లల మరణాలకు మధ్య ప్రత్యక్ష కారణం లేదని గాంబియా తెలియజేసినట్లు డీసీజీఐ తెలిపింది. ఈ సమయంలో మరణించిన కొంత మంది పిల్లలు అసలు ఆ సిరప్‌ను తీసుకోలేదని చెప్పింది.
చిన్ననాటి స్నేహితురాలు రాధికతో అనంత్ అంబానీ నిశ్చితార్థం.. ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..
ఇదిలా ఉండగా.. ఉజ్బెకిస్థాన్ లో 18 మంది చిన్నారుల మరణాలకు నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన ‘డాక్-1 మ్యాక్స్’ అనే దగ్గు సిరప్ కారణం అని ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రాథమిక ప్రయోగశాల అధ్యయనాలు డాక్ -1 మాక్స్ సిరప్ శ్రేణిలో ఇథిలిన్ గ్లైకాల్ ఉందని తేలింది. ఈ పదార్ధం విషపూరితమైనది. 95 శాతం సాంద్రీకృత ద్రావణం కిలోకు 1-2 మిల్లీ లీటర్ వల్ల రోగిలో వాంతులు, మూర్ఛ, హృదయ సంబంధ సమస్యలు, తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం తీవ్రమైన మార్పులకు కారణమవుతుంది.
